ETV Bharat / state

జర భద్రం.. మాస్కు లేకుంటే జరిమానా

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కొత్త నిబంధనలు చాలా వచ్చాయి. వాటిని కచ్చితంగా తెలుసుకొని పాటించాలి. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసి ప్రజలను ఇళ్లకు పరిమితం చేసేందుకు అనేక కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు.

everyone should wear mask
జర భద్రం.. మాస్కు లేకుంటే జరిమానా
author img

By

Published : Apr 14, 2020, 2:00 PM IST

ముఖానికి తొడిగే మాస్కు నుంచి కారులో ఇద్దరికి మించి ప్రయాణించే వరకు అనేక రకాల రూల్స్‌ కరోనా కాలంలో అమల్లోకి వచ్చాయి. వీటిపై అవగాహన కలిగి ఉండడం వ్యక్తిగతంగానే కాదు, సమాజానికి కూడా శ్రేయస్కరం. ‘జాతీయ విపత్తు నిర్వహణ చట్టంతోపాటు ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే.

మాస్కు ధరించకపోయినా..

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకొంది. బయటకెళ్లే వారు తప్పకుండా ముఖానికి మాస్కు వేసుకోవాలని నిబంధన పెట్టింది. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌తో పాటు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ పోలీసులు ఇప్పటి వరకు ఎవరైనా మాస్కు ధరించకుండా కనిపిస్తే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై మాస్కు లేకుండా బయటకొస్తే పోలీసులు చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవచ్ఛు జరిమానా కూడా విధిస్తారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని ఓ గ్రామంలో మాస్కు ధరించకుండా చికెన్‌ అమ్ముతున్న వ్యక్తికి రూ. 500 జరిమానా విధించారు.

రహదారులపై ఉమ్మి వేస్తే..

రోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతున్న కారణంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. గుట్కాలు, పాన్‌లు తిని ఉమ్మేయడం, బయట నోరు కడుక్కోవడం లాంటివిప్పుడు నేరం కింద పరిగణిస్తారు. ఇప్పటికే వరంగల్‌ రూరల్‌ జిల్లా పోలీసులు ఒక వ్యక్తి ఉమ్మివేసినందుకు కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలోని ఉమ్మి తొట్టెలు ఏర్పాటు చేశారు.

అవాస్తవాలు ప్రచారం చేసినా..

రోనా నివారణ నేపథ్యంలో అవాస్తవాలు ప్రచారం చేసినా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వాస్తవం లేని సమాచారం, నకిలీ చిత్రాలు పోస్టు చేయడం.. ఇలా ఏ రకమైన అవాస్తవ ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. వర్ధన్నపేట, పరకాల, కమలాపూర్‌ తదితర మండలాల పరిధిలో సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.

అనవసరంగా తిరిగితే..

త్యవసరమైతే బైక్‌పై ఒక్కరు మాత్రమే వెళ్లాలి. కారణాలు లేకుండా ద్విచక్రవాహనాలపై తిరిగే వారిని పోలీసులు పట్టుకుంటున్నారు. వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటిజన్‌ ట్రాక్‌ విధానంలో నిత్యం వందలాది వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. వాటిని లాక్‌డౌన్‌ తర్వాత అప్పగిస్తారు.

సమయం దాటితే ..

నిత్యావసరాల దుకాణాలు నియమిత సమయం ప్రకారం తెరిచి ఉంచాలి. సమయం దాటినా తెరిచి ఉంచితే పోలీసులు చర్యలు తీసుకుంటారు. అధిక ధరలకు అమ్మినా జరిమానా విధిస్తున్నారు. రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలో తాజాగా రెండు దుకాణాలను సీజ్‌ చేశారు. వరంగల్‌ నగరంలోని కాజీపేటకు చెందిన వ్యాపారి ఎక్కువ ధరకు సరుకులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రాగా.. అధికారులు రూ. 35 వేల జరిమానా విధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.