ETV Bharat / state

'శ్రీరామనవమి రోజు ప్రపంచ రికార్డు సృష్టిస్తాం' - శ్రీరామనవమి రోజు ప్రపంచరికార్డుకు యత్నం

శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రపంచరికార్డు సృష్టించనున్నట్లు పూరీ జగన్నాథ్​ ఆలయ ధర్మ బోధకుడు చిన్మయి కృష్ణదాస తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటినుంచే జై శ్రీరామ్​ అంటూ ఓ వీడియోను చేసి పంపాలని ఆయన కోరారు.

Everyone should contribute to the world record on Sri Ramanavami day
శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రపంచరికార్డుకు సృష్టిస్తాం
author img

By

Published : Apr 20, 2021, 5:01 AM IST

శ్రీరామనవమి సందర్భంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్​, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటే లక్ష్యంగా ప్రపంచ రికార్డు సృష్టించనున్నట్లు పూరీ జగన్నాథ్ ఆలయ ధర్మ బోధకుడు చిన్మయి కృష్ణ దాస తెలిపారు. అయోధ్య రామ జన్మభూమి ఆలయం పట్ల విశ్వాసం, భక్తిని చూపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే "హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే" అంటూ జై శ్రీరామ్ అని చెప్పే వీడియోను రూపొందించి మీ పేరు, ఊరు, ఫోన్ నంబర్​తో సహా 8919717982 కు టెలీగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలని ఆయన కోరారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఈ ఆన్‌లైన్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో పాల్గొని విజయవంతం చేయాలని చిన్మయి కృష్ణదాస విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని అన్నికోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.