ETV Bharat / state

ఆదివారం 10 గంటల 10 నిమిషాల్లో వారు ఏం చేశారంటే...? - ktr latest news

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు చేపట్టిన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం కొనసాగుతోంది. దోమల నివారణ, సీజనల్​ వ్యాధుల కట్టడిలో భాగంగా ప్రతి ఆదివారం... పురపాలకశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు... తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేశారు.

EVERY SUNDAY 10 O CLOCK 10 MINUTES PROGRAMME  IN TELANGANA
ఆదివారం 10 గంటల 10 నిమిషాల్లో వారు ఏం చేశారంటే...?
author img

By

Published : May 24, 2020, 4:41 PM IST

ఆదివారం 10 గంటల 10 నిమిషాల్లో వారు ఏం చేశారంటే...?

వర్షాకాలంలో విజృంభించే సీజనల్​ వ్యాధుల కట్టడికి చేపట్టిన డ్రై డే విజయవంతంగా కొనసాగుతోంది. దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట గణేశ్ నగర్​లో పర్యటించిన ఆర్థికమంత్రి హరీశ్​రావు.. కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పంచారు. నిజామాబాద్​ జిల్లా వేల్పూరులోని తన స్వగృహంలో రోడ్లు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి పరిసరాలు పరిశుభ్రం చేసి, మొక్కలకు నీళ్లు పట్టారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. హైదరాబాద్​ బోయిన్​ పల్లిలోని తన ఇంటి పెరట్లో చెత్తను తొలగించి... కుండీల్లోని నీటినిల్వను తొలగించారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్​లోని తన నివాసంలో పూల కుండీలను శుభ్రం చేశారు. ఇంటి అవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలిగించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా వరంగల్అర్బన్​ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లిలో.. ప్రభుత్వ చీఫ్​ విప్ వినయభాస్కర్ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాలోకి వెళ్లి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు.

మెదక్​లోని తన ఇంట్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి డ్రై డే నిర్వహించారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలిగించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్​రెడ్డి పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమల నిర్మూలనలో భాగంగా చెత్తను తొలిగించి మొక్కలకు నీళ్లు పట్టారు. అనంతరం కరోనా కట్టడికి బూమ్ స్ప్రేయర్​తో రసాయనాలను పిచికారి చేయించారు.

ఇదీ చదవండి: 'ఇదంతా తబ్లీగీల వల్లే... వారి నేరాలకు శిక్ష తప్పదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.