తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఐడీపీఎల్‌లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వివిధ కుల వృత్తులు, కుల సంఘాలకు చెందిన 70 మందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు ఆచారి, హెచ్ఏఎల్ డైరెక్టర్ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కుల వృత్తుల వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆచారి, మల్లారెడ్డిలు సందర్శించారు. అనంతరం కుల వృత్తుల వారిని ఘనంగా సన్మానించారు. ప్రతి కులాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయకులు తెలిపారు.
ఇదీ చూడండి: భద్రాచలం కేంద్రంగా రాష్ట్రాలు దాటుతోన్న గంజాయి