ETV Bharat / state

సమస్య ఈటీవీకి చేరింది... వెంటనే రోగులకు సాయం అందింది - latest ananthapuram news

ఏపీ లోని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటికి ఇబ్బంది పడుతున్న కొవిడ్ రోగుల గురించి ఈటీవీ ప్రతినిధి ద్వారా తెలుసుకున్న దాతలు సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చారు. పదహారు ఈజీ చైర్స్, 15 నీళ్ల క్యాన్లు ప్రభుత్వ ఆసుపత్రికి వితరణ చేశారు. రోజూ శుద్ధజలం ట్యాంకర్​తో నీటిని క్యాన్లకు నింపటానిని మరో దాత ముందుకు వచ్చారు.

సమస్య ఈటీవీకి చేరింది...వెంటనే రోగులకు సాయం అందింది

author img

By

Published : Jul 27, 2020, 10:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజూ ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో అనేక మంది కొవిడ్ రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. వీరికి వెంటనే మంచం కేటాయించి, ఆక్సిజన్ అమర్చేలోపే ప్రాణాలు పోతున్న వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఆసుపత్రి వైద్యుడు డా.నవీద్ ఈటీవీ దృష్టికి తీసుకొచ్చి, దాతల ద్వారా సహాయం అందేలా చేయాలని కోరారు. రోగులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే పడుకునే తరహా కుర్చీలో కూర్చోపెట్టి ఆక్సిజన్ అమర్చితే కొంతమందికైనా ప్రాణాలు కాపాడవచ్చని డా.నవీద్ ఈటీవీకి చెప్పారు. ఈజీ చెయిర్ తరహా కుర్చీలను దాతల ద్వారా ఇప్పించాలని కోరారు. ఆసుపత్రిలోని ఏడు కొవిడ్ వార్డుల్లో తాగునీరు క్యాన్లు ఏర్పాటుకు దాతలు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పారు.

వైద్యుడి అభ్యర్థనను ఈటీవీ ప్రతినిధి.. అనంతపురంలోని మునిరత్నం ట్రావెల్స్ యజమాని శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా 19 వేల రూపాయల విలువైన పదహారు ఈజీ చైర్స్, 15 నీళ్ల క్యాన్లు ప్రభుత్వ ఆసుపత్రికి వితరణ చేశారు. రోజూ శుద్ధజలం ట్యాంకర్​తో నీటిని క్యాన్లకు నింపటానికి నగరానికి చెందిన ఎంజీ మెటాలిక్స్ సంస్థ ఛైర్మన్ రమేష్ ముందుకు వచ్చారు. సమస్య ఈటీవీ వారికి చెప్పిన వెంటనే రోగులకు ఈ సహాయం అందిందని డా.నవీద్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా తాను ఎప్పుడూ ముందుంటానని మునిరత్నం ట్రావెల్స్ యజమాని చెప్పారు.
ఇదీ చదవండి అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్​..ఆస్పత్రి సిబ్బంది ఆడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.