ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 1PM - టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@ 1PM
టాప్​టెన్​ న్యూస్​@ 1PM
author img

By

Published : Jan 21, 2021, 1:00 PM IST

1. రెండో దశలో ప్రధానికి

రెండో దశ కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ప్రధాని సహా ముఖ్య నేతలకు టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 50 ఏళ్ల వయస్సు పైబడిన వారికీ టీకా అందజేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రాహుల్ ప్రచార శంఖారావం

జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్​ ప్రారంభించనుంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. స్వాప్​తో దోచేస్తారు

మొబైల్ నంబర్లను స్వాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. నైజీరియాలో ఉంటూ ఓ వ్యక్తి మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కుల వృత్తుల వారికి అండ

కుల వృత్తులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుల వృత్తులకు వెయ్యి కోట్లతో చేయూతనిస్తామని హామీనిచ్చారు. గంగపుత్రల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. షెడ్యూల్​ ప్రకారమే..

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. బైడెన్​కు సవాళ్లే!

సెనేట్​లో మెజారిటీ సమానంగా విడిపోవడం వల్ల కాంగ్రెస్​పై పూర్తి ఆధిపత్యానికి అడుగు దూరంలో నిలిచిపోయారు డెమొక్రాట్లు. ఈ నేపథ్యంలో 50-50 మెజారిటీతో బైడెన్​కు లాభమెంత? నష్టమెంత? ఓసారి పరిశీలిస్తే..

7. థాలీ తినేస్తే బుల్లెట్​ ఫ్రీ!

పుణెకు చెందిన హోటల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ సవాల్ విసిరింది. 'బుల్లెట్​ థాలీ' తింటే రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ బహుమతిగా ఇస్తామని తెలిపింది. అందులో ఓ మెలిక కూడా ఉంది. అదేమిటంటే..

8. 30 ఏళ్లలో బుల్​ పరుగులు

సెన్సెక్స్ ఇటీవల రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. కరోనా వల్ల 2020లో 25 వేల స్థాయికి పడిపోయినా.. తాజాగా (గురువారం) 50 వేల మార్క్​ను దాటింది. అంటే ఏడాది కాలం కూడా గడవకముందే 25 వేల పాయింట్లు లాభపడింది. ఈ నేపథ్యంలో 50 వేల పాయింట్ల వరకు సెన్సెక్స్ ప్రయాణాన్ని పరిశీలిద్దాం.

9. థాయ్​ ఓపెన్​లో భారత్​ ముందంజ

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​లో గురువారం జరిగిన రెండో రౌండ్​లో గెలుపొంది ​క్వార్టర్​ఫైనల్స్​లోకి ప్రవేశించాడు భారత షట్లర్​​ ​సమీర్​ వర్మ. మిక్స్​డ్​ డబుల్స్​లో సాత్విక్​ రాజ్​ రంకిరెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం కూడా క్వార్టర్​ ఫైన్​ల్స్​లోకి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆ కేసులో కంగనకు సమన్లు

స్టార్​ హీరోయిన్ కంగనా రనౌత్​కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. గేయ రచయిత జావేద్​ అక్తర్​ నమోదు చేసిన పరువునష్టం దావా కేసులో శుక్రవారం విచారించేందుకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.