ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@9 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9pm news, telangana news
టాప్​ టెన్​ న్యూస్, top news
author img

By

Published : Apr 7, 2021, 8:58 PM IST

1.కర్ఫ్యూకి ఆస్కారం లేదు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కొవిడ్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. తెరాసలో విలీనం

తెలుగుదేశం శాసనసభాపక్షం తెరాస శాసనసభాపక్షంలో విలీనమైంది. తెలుగుదేశం తరఫున ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు టీడీఎల్పీని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. చర్యలు తప్పవు

ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలను గౌరవించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే.. తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆరు నెలల పాటు అనాథాశ్రమంలో సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్​ను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అత్యవసరమైతేనే రండి..

దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలోనూ సెకండ్‌ వేవ్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే వైద్యారోగ్యశాఖపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. గ్రీన్​ సిగ్నల్​

ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ప్రజల దృష్టిని మరల్చడానికే

కరోనా టీకా కొరతపై మహారాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్​. కొన్ని రాష్ట్రాలు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు మాని.. వైద్య సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి సారించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. కష్టకాలం..

కొవిడ్​ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని ప్రపంచ బ్యాంక్​ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా అణగారిన వర్గాల్లో అసమానతలు పెరిగాయని పేర్కొంది. మరోవైపు, సేవా రంగం​లో పనిచేసే వారు ఆరోగ్యం, ఆర్థికం.. రెండు అంశాల్లోనూ నష్టపోయారని అమెరికా ట్రెజరీ మంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. లాభాలతో మార్కెట్లు

బుధవారం సెషన్​ను స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి.. 49,661 మార్కును చేరింది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. క్లారిటీ వచ్చింది

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​తో పాటు టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​ను అనుకున్న తేదీ ప్రకారం నిర్వహిస్తామని ఐసీసీ మధ్యంతర సీఈఓ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన వర్చువల్​ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. తగ్గేది లే...!

సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలోని అల్లుఅర్జున్​ పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ఆద్యంతం యాక్షన్​ సన్నివేశాలతో అదరగొడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.