ETV Bharat / state

SAJJANAR: 'సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తా.. ఆర్టీసీ సొంతంగా నిలబడేలా చేస్తా'

author img

By

Published : Sep 4, 2021, 9:42 AM IST

Updated : Sep 4, 2021, 10:04 AM IST

సుధీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వం ఆర్టీసీకి ఎండీని నియమించింది. ఐపీఎస్​ అధికారి సజ్జనార్​ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీలో తన మార్క్ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని అంశాలపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తానంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తో 'ఈటీవీ భారత్' ప్రత్యేక ముఖాముఖి..

SAJJANAR: 'సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తా.. ఆర్టీసీ సొంతంగా నిలబడేలా చేస్తా'
SAJJANAR: 'సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తా.. ఆర్టీసీ సొంతంగా నిలబడేలా చేస్తా'
SAJJANAR: 'సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొస్తా.. ఆర్టీసీ సొంతంగా నిలబడేలా చేస్తా'
  • ఆర్టీసీ ఎండీగా ఏ అంశానికి ప్రాధాన్యత ఇస్తారు?

ఆర్టీసీలో నా మొదటి ప్రాధాన్యత స్వావలంబన. సంస్థ నష్టాల్లో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు ఆదుకుంది. ఇకపై ఆర్టీసీకి అవసరమైన కనీస నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా.. తామే సమకూర్చుకోవడంపై దృష్టి సారిస్తాం. ప్రయాణికుల సంఖ్యను ఎలా పెంచాలి..? ఆదాయం ఎలా తీసుకురావాలి..? అనే అంశాలపై దృష్టిపెడతాం.

  • ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు జీతం కోసం ఎదురుచూడకుండా ఉండేందుకు మీరు ఎలాంటి హామీనిస్తారు?

ఏ సంస్థ అయినా నష్టాల్లో ఉన్నప్పుడు జీతాలకు కచ్చితంగా కొంత సమయం పడుతుంది. ఈ సమస్య కేవలం ఒక్క ఆర్టీసీది మాత్రమే కాదు.. బయట చాలా సంస్థలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. కొన్ని సంస్థల్లో నెలల తరబడి జీతాలు అందని పరిస్థితి నెలకొంది. కానీ.. ఇక్కడ అలా కాదు.. ప్రభుత్వం ఆదుకుంటుంది. జీతాలు కొంత ఆలస్యమైనా వస్తున్నాయి. ఎందుకు మనమే నిలదొక్కుకోకూడదు అనే ఆలోచన చేస్తే.. అలా జీతాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.

  • ప్రయాణికులను సంస్థకు దగ్గర చేసేందుకు ఆర్టీసీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ఆలోచన ఏమైనా ఉందా..?

సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి అధికారులు ఇప్పటికే కొంత పని చేశారు. నేను సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశంపై పనిచేసి వచ్చాను. ఇప్పటికే ఆర్టీసీలో ఈ-సిస్టం ఉంది. ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పని చేశాం. ఆ ఫలితాలు చూసి.. కచ్చితంగా ఇక్కడ కూడా వాటిని అమలు చేస్తాం. పాశ్చాత్య దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏ సమయంలో బస్సు వెళుతుంది తదితర వివరాలు తెలియజేస్తారు. అలాంటి వ్యవస్థ ఇక్కడ ప్రవేశపెట్టేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.

  • మహిళా ఉద్యోగులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారు?

డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నాయి, మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తదితర అంశాలపై ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం.

  • 'ఆర్టీసీ ఆస్తులను అమ్ముతారు.. అందుకే ఎండీగా సజ్జనార్​ను తీసుకొచ్చారు' అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?

ఆర్టీసీ ఆస్తులను అమ్మడం జరగదు. అలాంటి ఆలోచన లేదు. ప్రజలు, ఆర్టీసీ కార్మికులు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దు. ఆదాయ వనరులను పెంచుకుంటూపోతే సంస్థ బాగుపడుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాల బారిన పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.

  • ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పైసా పైసా కూడబెట్టి సీసీఎస్​లో దాచుకుంటే.. ఇప్పుడు ఆ సంస్థ అత్యంత దయనీయంగా తయారైంది. దానిని ఎలా గాడినపెడతారు?

సీసీఎస్​కు సంబంధించి కొన్ని బ్యాంకులతో మాట్లాడాను. ప్రభుత్వంతో కూడా మాట్లాడాను. కొన్ని నిధులు కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి తొందరలోనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.

  • కార్మికుల సంక్షేమానికి ఎలాంటి భరోసానిస్తారు?

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కూడా సంక్షేమ సంఘం ఏర్పాటు చేసింది. కార్మికుల సమస్యలను కేటగిరీ వారీగా విభజించి.. పరిష్కారానికి కృషి చేస్తాను.

ఇదీ చూడండి: VC Sajjanar: టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్

Last Updated : Sep 4, 2021, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.