ETV Bharat / state

3 నెలలుగా బిల్ తీయకుంటే స్లాబులు మారుతాయా?

మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ వినియోగం 53శాతం పెరిగింది. బిల్లులు కూడా అంతే స్థాయిలో పెరిగాయి. మూడు నెలలుగా బిల్ తీయకుంటే స్లాబులు మారుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్​కు సంబంధించిన అంశాలపై ఎస్పీడీసీఎల్​ సీఎండీ రఘుమారెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.

author img

By

Published : May 20, 2020, 12:24 PM IST

Updated : May 20, 2020, 1:58 PM IST

etv-bharat-interview-with-spdcl-cmd-raghumareddy
3 నెలలుగా బిల్ తీయకుంటే స్లాబులు మారుతాయా?
3 నెలలుగా బిల్ తీయకుంటే స్లాబులు మారుతాయా?
  • మూడు నెలల బిల్లు ఒకేసారి ఇవ్వడం వల్ల స్లాబులు మారిపోయే అవకాశముందని వినియోగదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అలా స్లాబులు మారే అవకాశం ఉందా..?

ఏప్రిల్ నెలలో 150, మే లో 160 యూనిట్లు, జూన్​లో 130-140 యూనిట్లు వస్తాయనుకుంటే... మూడు నెలలకు కలిపి సుమారు 420-450 యూనిట్లు అనుకుంటే మొత్తం యూనిట్లను 3తో భాగించి... సుమారు 113 యూనిట్లు వస్తుంది. ఆ స్లాబ్ బిల్లును మాత్రమే వేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో స్లాబ్ మారే అవకాశం ఉండదు. వినియోగదారులు చింతించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు ఎప్పటికైనా బిల్లు కట్టాల్సిందే.

అనూహ్యంగా బిల్లు ఎక్కువగా వచ్చిన వారి బిల్లులను పరిశీలిస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తిదారులకు మేం ముందే డబ్బులు చెల్లిస్తున్నాం..అప్పుడే వినియోగదారులకు విద్యుత్ అందించగలుగుతున్నాం. అందుకే దయచేసి విద్యుత్ బిల్లులు చెల్లించండని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆన్​లైన్ విద్యుత్ చెల్లింపులు ఏమేరకు జరుగుతున్నాయి..?

ఎస్పీడీసీఎల్ బిల్లులను ఆన్​లైన్​లో చెల్లించవచ్చు. దీనితో పాటు యాప్​ను రూపొందించాం. మార్చిలో 42 లక్షల వినియోగదారుల్లో 26 లక్షల వినియోగదారులు ఆన్​​లైన్​లో కట్టారు. ఏప్రిల్​లో 27 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లిస్తే.. 22.5 లక్షల మంది ఆన్​లైన్​లో కట్టారు. మేలో 14.8 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లిస్తే.. అందులో 12 లక్షల వినియోగదారులు ఆన్​లైన్​లో చెల్లించారు. అంటే దాదాపు 75 నుంచి 80శాతం వినియోగదారులు లాక్​డౌన్ తర్వాత ఆన్​లైన్​లో చెల్లింపులు చేస్తున్నారు. లాక్​డౌన్​కు ముందు 50 నుంచి 60శాతం వినియోగదారులు మాత్రమే ఆన్​లైన్​లో చెల్లించేవారు.

  • టీఎస్​ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్​లో ఏమేం వివరాలు ఉంటాయి..?

టీఎస్ ఎస్పీడీసీఎల్ సంస్థ సొంతంగా టీఎస్ ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్​ను రూపొందించింది. ఇందులో విద్యుత్ కొత్త కనెక్షన్ నుంచి బిల్లు ఎక్కువ వచ్చినా.. బిల్లు రాకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బులు కూడా ఆన్​లైన్​లో చెల్లించవచ్చు.

  • బిల్లుల్లో గందరగోళం మొదలైంది. దానికి టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా ఏర్పాటు చేశారా?

వినియోగదారుల ఫిర్యాదు కోసం 1912 కస్టమర్ కేర్ నంబర్​ను ఏర్పాటు చేశాం. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మూడు షిప్టుల్లో 24 మంది పనిచేస్తుంటారు. వీళ్లు అన్ని రకాల ఫిర్యాదులు స్వీకరిస్తారు. బిల్లింగ్ ఫిర్యాదులు, విద్యుత్ సరఫరా ఫిర్యాదులు, కొత్త కనెక్షన్ ఇలా ఎటువంటి ఫిర్యాదు అయినా స్వీకరిస్తారు. సరఫరాకు సంబంధించిన ఫిర్యాదులను 2-3 గంటల్లో, బిల్లింగ్ సంబంధించిన ఫిర్యాదులను 24-48 గంటల్లో రిప్లయ్ ఇస్తారు.

Last Updated : May 20, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.