Accused Arrest for Rape in ESI Hospital : సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటన కేసులో ఎస్ఆర్ నగర్ పోలీసులు(SR Nagar Police Station) నిందితుడిని అరెస్ట్ చేశారు. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న ఈ కీచకుడిను పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలు జరిగిందేమిటంటే..?
Woman Raped in ESI Hospital : సోదరుడి చికిత్స కోసం సహాయకురాలుగా వచ్చిన యువతిపై ఈఎస్‌ఐ ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ పీవీ రామప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధితురాలు పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ యువతి (19).
ఆమె సోదరుడు ఓ రోజు పాఠశాలలో స్టేజీపై నుంచి కిందపడ్డాడు. దాంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో(ESI Hospital) చేర్పించి చికిత్స చేయించింది. ఇటీవల అతడికి మళ్లీ నొప్పి రావడంతో ఈ నెల 6న యువతి తన సోదరుడితో కలిసి ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చింది. సోదరుడు ఇన్‌పేషెంట్‌గా చేరటంతో యువతి కూడా అక్కడే ఉండవలసి వచ్చింది.
Man Arrested For Rapping Woman Hyderabad : శుక్రవారం రాత్రి సోదరుడికి భోజనం తీసుకురావడానికి ఆరో అంతస్తు నుంచి యువతి కిందికి వచ్చింది. పార్శిల్ తీసుకుని తిరిగి వెళ్తుండగా ఆమె దగ్గరకు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు వచ్చాడు. ప్రతిసారీ కిందకి రావాల్సిన పనిలేదనీ.. అక్కడి క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ (25) అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఏదైనా సహాయం కావాలన్నా అతడిని సంప్రదించాలని సూచించాడు.
యువతి తిరిగి లిఫ్ట్‌లో వెళ్తుండగా.. షాదాబ్ ఆమెను అనుసరించి బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రక్త పరీక్షలు(Blood Tests) చేసే గదిలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయందోళన చెందిన యువతి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు చేరుకొని గట్టిగా కేకలు వేశాడు.
దీంతో నిందితుడు పారిపోయాడు. బాధిత యువతి ఆసుపత్రి సిబ్బందికి తెలపడంతో.. హాస్పిటల్ అధికారులు(Hospital Officials) దీనిపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.