ETV Bharat / state

ఈఎస్​ఐ కుంభకోణం: డొల్ల కంపెనీలతో కోట్లు స్వాహా... - Esi Scam

వడ్డించేవాడు మనవాడైతే చివర బంతిలో కూర్చున్నా వస్తుంది అన్నట్లుగా మారింది ఐఎంఎస్ మందుల కుంభకోణం. అధికారులే తమ వారు అవ్వటం వల్ల దళారులు రెచ్చిపోయారు. కేవలం 8 నెలల్లోనే లెజెండ్ ఫార్మాకు ఏకంగా 54 కోట్ల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అలాగే తప్పుడు చిరునామాలో సంస్థ పెట్టడం వల్ల రక్తపరీక్షల స్ట్రిప్​ల సరఫరాలోనూ అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోదకశాఖ అధికారులు గుర్తించారు.

esi-scam-update-in-hyderabad
ఈఎస్​ఐ కుంభకోణం: డొల్ల కంపెనీలతో కోట్లు స్వాహా...
author img

By

Published : Jan 6, 2020, 5:47 AM IST

Updated : Jan 6, 2020, 7:44 AM IST

ఈఎస్​ఐ కుంభకోణం: డొల్ల కంపెనీలతో కోట్లు స్వాహా...

కార్మికుల వైద్య ఖర్చుల కోసం, బీమా వైద్య సేవల కోసం కేంద్రప్రభుత్వం ఏటా సుమారు 200 కోట్ల బడ్జెట్ మంజూరు చేస్తుంది. అధికారులు, దళారులు కుమ్మక్కై ఈ నిధులను అందినకాడికి దోచుకున్నారు. మార్కెట్లో అనేక సంస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒకటి, రెండు ఔషద సంస్థలకే మందుల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రభుత్వానికి రూ.11.70కోట్లు నష్టం

గతంలో లెజెండ్ ఫార్మా సరఫరా చేసిన స్ట్రిప్​లకు సంబంధించి 2017 ఏప్రిల్ 20 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు మొత్తం సుమారు 55 కోట్ల బిల్లులు మంజూరు చేశారు. తెల్ల రక్తకణాలు లెక్కించే ఒక్కో పరికరం విలువ 11వేల 800 కాగా దానిని 36వేలకు కొనుగోలు చేశారు. ఇలా ఈ ఒక్క సంస్థకు 8 నెలల కాలంలో మంజూరు చేసిన బిల్లుల వల్ల ప్రభుత్వానికి 11.70 కోట్ల నష్టం జరిగినట్లు అనిశా అధికారులు తేల్చారు. ఇంత అధిక ధరకు ఒకే సంస్థ వద్ద ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని బట్టి చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు.

ఓమ్మి మెడి ఓ డొల్ల సంస్థ

లెజెండ్ ఫార్మాలో జమ అయిన డబ్బంతా ఆ తర్వాతి కాలంలో ఓమ్ని మెడిలోకి బదిలీ అయినట్లు తేలింది. ఈ సంస్థ లెజెండ్ ఫార్మాకు డొల్ల సంస్థగా తేలిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రధానంగా తెల్లరక్తకణాలు లెక్కించడం, రక్తంలో చక్కెర స్థాయి కొలిసేందుకు ఉపయోగించే స్ట్రిప్ కొనుగోలు పేరుతోనే ఈ కుంభకోణం జరిగిందని అధికారులు తేల్చారు.

ఒక్క సంస్థకు... రెండు చిరునామాలా

లెజెండ్ ఫార్మాకు రెండు వేర్వేరు చిరునామాలు ఉండటం కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. 2018లో ఈ సంస్థను వాణిజ్యపన్నుల శాఖ కూకట్‌పల్లిలోని రాజీవ్ గాంధీనగర్​లో ఓ ఇంటి నంబరుతో నమోదు చేయించారు. కాని ఔషధ నియంత్రణ శాఖ వద్ద నమోదు చేయించినప్పుడు మాత్రం మరో చిరునామాగా పేర్కొన్నారు. ఇలా రెండు వేర్వేరు చిరునామాలు ఎందుకు ఇచ్చారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది . దీనిపైనా అనిశా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

TG_HYD_02_06_ESI_SCAM_UPDATE_PKG_DRY_3182400 రిపోర్టర్ నాగార్జున ( )వడ్డించేవాడు మనవాడైతే చివర బంతిలో కూర్చున్నా వస్తుంది అన్నట్లు గా మారింది ఐఎంఎస్ మందుల కుంబకోణం. అధికారులే తమ వారు అవ్వడంతో దళారులు రెచ్చిపోయారు. కేవలం 8 నెలల్లోనే లెజెండ్ పార్మాకు ఏకంగా 54 కోట్లు బిల్లులు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులను వెంటనే ఓ మెడ్ కు బదిలీ చేశారు . ఈ ఒక్క లావాదేవీలోనే ప్రభుత్వానికి 11.7 కోట్ల నష్టం కలిగించారు. అలాగే తప్పుడు చిరునామాలో సంస్థ పెట్టడంతోపాటు రక్తపరీక్షల స్ట్రిప్ ల సరఫరాలోనూ అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోదకశాల అనిత అధికారులు గుర్తించారు . ఓమ్ని మెడి సంస్థ అధినేత శ్రీహరిబాబు ఆలియాస్ బాట్టి తన అనుచరుల ద్వారా ఐఎంఎస్ అవకతవకల్లో పోషించిన పాత్రను అనిశా అధికారులు తవ్వితీస్తున్నారు. వీరి దర్యాప్తలో ఆనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి . వాయిస్ కార్మికుల వైద్య ఖర్చుల కోసం బీమా వైద్య సేవల ద్వారా ఏటా సుమారు 200 కోట్ల బడ్జెట్ మంజూరు చేస్తుంటారు. అధికారులు, దళారులు కుమ్మక్కై ఈ నిధులను అందినకాడికి దోచుకున్నారు. మార్కెట్లో అనేక సంస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒకటి, రెండు ఔషద సంస్థలకే మందుల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో లెజెండ్ ఫార్మా సరఫరా చేసిన స్ట్రిప్ లకు సంబంధించి 2017 ఏప్రిల్ 20 నుంచి డిసెంబరు 5వ తేదీ వరకు మొత్తం సుమారు 55 కోట్ల బిల్లులు మంజూరు చేశారు. తెల్ల రక్తకణాలు లెక్కించే 11,800 విలువైన ఒక్కో పరికరాన్ని 36 వేలకు కొనుగోలు చేశారని, ఇలా ఈ ఒక్క సంస్థకు 8 నెలల కాలంలో మంజూరు చేసిన బిల్లులు వల్ల ప్రభుత్వానికి 11.70 కోట్ల నష్టం జరిగినట్లు అనిశా అధికారులు తేల్చారు. ఇంత అధిక ధరకు ఒకే సంస్థకు ఒప్పందాన్ని కుదుర్చుకోవడాన్ని బట్టి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే లెజెండ్ ఫార్మాలో జమ అయిన డబ్బంతా ఆ తర్వాతి కాలంలో ఓమ్ని మెడిలోకి బదిలీ అయినట్లు తేలింది. దాంతో లెజెండ్ ఫార్మా అనేది ఓమ్ని మెడి కి డొల్ల సంస్థగా తేలిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అనిశా అధికారుల దర్యాప్తులో అనేక ఆశక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా తెల్లరక్తకణాలు లెక్కించడం, రక్తంలో చక్కెర స్థాయి కొలిసేందుకు ఉపయోగించే స్ట్రిప్ కొనుగోలు పేరుతోనే ఈ కుంభరణం జరిగిందని అధికారులు తేల్చారు. స్వీడన్ కు చెందిన హిమోక్యూర్ సంస్థ వీటిని సరఫరా చేస్తుంది. అయితే వాస్తవంగా ఈ సంస్థతో సంబంధం లేకుండా లెజెండ్ ఫార్మా సంస్థ తమ అధీకృత డీలర్ అన్నట్లు ఒక తప్పుడు లేఖ పుట్టించారు. వాస్తవానికి ఈ లేఖకు హిమో క్యూర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఇదిలా ఉంటే 4707289 బ్యాచ్ నంబరు కలిగిన ఒక స్ట్రిప్ ను హిమోక్యూర్ నుంచి ఇటు లెజండ్ ఫార్మకి, ఆటు ఓమ్మి మెడ్ కి కూడా సరఫరా చేసినట్లు అనిశా దర్యాప్తులో తేలింది. ఒక బ్యాచ్ స్ట్రిప్ ఒక్కటి మాత్రమే ఉంటుందని, అలాంటిది ఒక స్ట్రిప్ రెండు సంస్థలకు ఎలా సరఫరా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ లెక్కన అసలు మందులు సరఫరా చేయకుండానే చేసినట్లు చూపించి ఉంటారని, రికార్డుల్లో నమోదు చేయడానికి లెజెండ్ ఫార్మాకు సరఫరా చేసిన ప్ బ్యాచ్ నంబర్లే వేసి ఓమ్మిమెకు కూడా నకిలీ బిల్లులు తయారు చేసి ఉంటారని అనిశా అధికారులు ఆనుమానిస్తున్నారు. దీన్ని నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు జరుపుతున్నారు . లెజెండ్ ఫార్మాకు రెండు వేర్వేరు చిరునామాలు ఉండటం కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. 2018లో ఈ సంస్థను వాణిజ్యపన్నుల శాఖ కూకట్‌పల్లిలోని రాజీవ్ గాంధీనగర్ లో ఓ ఇంటి నంబరుతో నమోదు చేయించారు. కాని ఔషధ నియంత్రణ శాఖ వద్ద నమోదు చేయించినప్పుడు మాత్రం మరో చిరునామాగా పేర్కొన్నారు. ఇలా రెండు వేర్వేరు చిరునామాలు ఎందుకు ఇచ్చారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది . దీనిపైనా అనీశా అదికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jan 6, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.