ఈఎస్ఐ మందుల కుంభకోణంలో దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహారం బయటకు వచ్చింది. ఏసీబీ అదుపులోకి తీసుకున్న తేజ ఫార్మా కంపెనీ నిర్వాహకుడు రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస రెడ్డి పేరిట రెండు షెల్ కంపెనీలు ఉన్నట్లు అనిశా ఇప్పటికే గుర్తించింది. ఈ రెండు కంపెనీల పేరిట డైరెక్టర్ దేవికా రాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి కోట్ల సొమ్మును గోల్మాల్ చేసినట్లు గుర్తించారు.
ఆ డబ్బుతో దేవికా రాణి 3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా ఏసీబీ విచారణలో తేలింది. ఈ డొల్ల కంపెనీలకు సంబంధించి హైదరాబాద్ అల్వాల్‌లోని శ్రీనివాస రెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించి.. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస రెడ్డిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తా: పవన్