ఈశ్వరీ బాయి వర్ధంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ మారేడ్ పల్లి ఎస్డీ రోడ్డులోని ఈశ్వరీ బాయి విగ్రహానికి మాజీమంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో నేతలు పూల మాలవేసి నివాళులు అర్పించారు. టీచర్ ఉద్యోగం చేస్తూ తన సోదరుని సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించారని గీతారెడ్డి తెలిపారు.
కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మహానీయురాలని కొనియాడారు. అధికార పక్షం ఆహ్వానించి మంత్రి పదవులు ఇస్తామన్న.. వెళ్లకుండా ప్రజల పక్షానే పోరాడిన ధీరవనిత అని పేర్కొన్నారు. ఈశ్వరీబాయి ఆశయ సాధన కోసం ఆమె అడుగు జాడలోనే నడుస్తూ ముందుకు సాగుతానని వెల్లడించారు.
ఇవీ చూడండి: నకిలీ విత్తనాలతో నరకప్రాయంగా మారిన రైతుల బతుకులు