ETV Bharat / state

TS Ipass :మూడు జిల్లాల్లోనే.. మూడోవంతు పరిశ్రమలు - telangana government

పారిశ్రామిక వికేంద్రీకరణ లక్ష్యంతో టీఎస్​ఐపాస్​ విధానానికి శ్రీకారం చుట్టింది. 33 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేలా మౌలిక వసతులను విస్తరించింది. కానీ పారిశ్రామిక వేత్తలు మారుమూల జిల్లాల వైపు మొగ్గుచూపడం లేదనేది స్పష్టం అయింది. నగరాలు, పట్టణాలకు సమీపంలోనే పారిశ్రామిక వర్గాలు పరిశ్రమలు స్థాపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

TS Ipass
TS Ipass
author img

By

Published : Aug 21, 2021, 7:24 AM IST

మేడ్చల్‌ 3,327, సంగారెడ్డి 1,149, రంగారెడ్డి 1,089... రాష్ట్ర పారిశ్రామిక అనుమతుల స్వీయ ధ్రువీకరణ విధానం(టీఎస్‌ఐపాస్‌)లో గత ఆరేళ్ల కాలంలో అనుమతులు పొందిన పరిశ్రమలివి. అదే సమయంలో నారాయణపేట జిల్లాలో 11, ములుగు జిల్లాలో 15 మాత్రమే అనుమతులు పొందాయి. దీన్నిబట్టి మారుమూల జిల్లాల వైపు పారిశ్రామిక వేత్తలు మొగ్గుచూపడం లేదనేది సుస్పష్టం. ఇది టీఎస్‌ఐపాస్‌ ఏర్పాటు లక్ష్యానికి విఘాతం కల్గిస్తుండగా, మౌలిక వసతుల కొరత, రవాణా సౌకర్యాల లేమి వంటివి ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు ప్రతిబంధకాలుగా ఉన్నట్టు పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఫలితమివ్వని వికేంద్రీకరణ

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణ లక్ష్యంతో టీఎస్‌ఐపాస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. 33 జిల్లాల్లోనూ పరిశ్రమలు స్థాపించేలా 1.57 లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటుచేసి జాతీయ రహదారులు సహా ఇతర మౌలిక వసతులను విస్తరించింది. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, వలసలకు అడ్డుకట్టవేయడం, కాలుష్య నివారణ, నగరాలపై ఒత్తిడిని తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మారుమూల జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించాలంటూ పారిశ్రామికవేత్తలను పదేపదే కోరుతున్నారు. అందులో భాగంగానే కేరళకు చెందిన కైటెక్స్‌ సంస్థ హైదరాబాద్‌పై ఆసక్తి చూపినప్పటికీ, దాన్ని నేరుగా వరంగల్‌లోని జౌళి పార్కు వైపు మళ్లించారు. మొత్తంగా పారిశ్రామిక వర్గాలు నగరాలు, పట్టణాలకు సమీపంలో పరిశ్రమలు స్థాపించేందుకే మొగ్గుచూపుతుండటంతో వికేంద్రీకరణ లక్ష్యం నెరవేరడం లేదు.

పెట్టుబడుల్లో రంగారెడ్డిదే అగ్రస్థానం

రంగారెడ్డి జిల్లా రూ.67,431 కోట్ల పెట్టుబడులతో, 8,81,050 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడుల్లో నల్గొండ రూ.27,061 కోట్లు, భద్రాద్రి(రూ.21,917 కోట్లు), పెద్దపల్లి (రూ. 13,644 కోట్లు), మేడ్చల్‌ (రూ.13,593 కోట్లు), సంగారెడ్డి (రూ.12,544 కోట్లు) జిల్లాలు ముందున్నాయి. ఇందులోనూ ములుగు (రూ.3 కోట్లు), నారాయణపేట (రూ.7 కోట్లు) జిల్లాలు వెనుకంజలో నిలిచాయి.

1,90,557 మందికి ఉపాధి కల్పించడం ద్వారా రంగారెడ్డి తర్వాత స్థానంలో వరంగల్‌ జిల్లా ఉంది. ‘మెగా జౌళిపార్కుకు తోడు.. మెరుగైన రైల్వే వసతులు ఉండటం ఆ జిల్లాకు లాభించింది. అన్ని ప్రాంతాలకు సమీపంలో విమానాశ్రయాలు, ఇతర మెరుగైన రైల్వే లైన్లు ఏర్పాటైతే తప్ప ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ ఊపందుకోదు’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

.

అన్ని అనుకూలతలు ఉన్నచోటే..

2015 నుంచి గత మార్చి వరకు వివిధ సంస్థలు 15,852 పరిశ్రమల స్థాపనకు టీఎస్‌ఐపాస్‌ విధానం కింద అనుమతులు పొందాయి. రూ.2,14,951 కోట్ల పెట్టుబడులతోపాటు 15,60,506 ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చాయి. ఇందులో 12,198 ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాయి. 3,654 పరిశ్రమల్లో పనులు సాగుతున్నాయి. అందులో సింహభాగం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. అవుటర్‌రింగ్‌ రోడ్డు, జాతీయ రహదారుల సౌకర్యానికి తోడు హైదరాబాద్‌ విమానాశ్రయం సమీపాన ఉండడం వంటి అనుకూలతల కారణంగా ఈ మూడు జిల్లాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు పారిశ్రామికవర్గాలు పేర్కొంటున్నాయి. కరీంనగర్‌ జిల్లా 996 పరిశ్రమలతో కొంత మేరకు వాటికి సమీపాన వచ్చింది. ప్రభుత్వం అవుటర్‌ రింగ్‌రోడ్డు బయటే పరిశ్రమలకు అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో కాలుష్యం వెదజల్లే వాటికి హైదరాబాద్‌లో అనుమతులు ఇవ్వలేదు. కాలుష్య రహితమైన 42 యూనిట్లకు మాత్రమే అనుమతులు జారీ చేసింది. ‘‘నారాయణపేట, ములుగు, వనపర్తి, జోగులాంబ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు హైదరాబాద్‌కు దూరంగా ఉండడంతో ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడం లేదని’’ టీఎస్‌ఐపాస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన ప్రాంతాలైన జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం జిల్లాల్లో సింగరేణి ఆధారిత, ఆహారశుద్ధి పరిశ్రమలకున్న అనుకూలతల వల్ల కొంతమేరకు ఏర్పాటవుతున్నట్టు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: Gas Rates Hike: తొమ్మిది నెలల్లో రూ.265 పెరిగిన సిలిండరు ధర..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.