ఇంజినీరింగ్ విద్యా సంవత్సరాన్ని జేఎన్టీయూహెచ్ ఖరారు చేసింది. ఈనెల 24 నుంచి బీటెక్, బీఫార్మసీకి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 18 నుంచి 24 వరకు దసరా సెలవులు ప్రకటించనున్నారు. జనవరి 11 నుంచి 23 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 25 నుంచి రెండో సెమిస్టర్ ప్రారంభించనున్నారు.
మే 7 నుంచి జూన్ 19 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిన జేఎన్టీయూహెచ్... జూన్ 21 నుంచి జులై 10 వరకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. సిలబస్‌లో మార్పులు ఉండవని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామన్న జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్... ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ విద్యా సంవత్సరం త్వరలో ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.