ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం.. అమిత్​ ఆరోరాకు 7 రోజుల ఈడీ కస్టడీ

author img

By

Published : Nov 30, 2022, 5:32 PM IST

Amit Arora In Delhi Liquor Case: దిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మనీశ్ సిసోదియా సన్నిహితుడైన అమిత్​ ఆరోరాను అరెస్ట్ చేసింది. అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో అరోరాను హాజరుపరిచింది. అమిత్​ను కస్టడీకి అనుమతించాలని ఈడీ కోర్టును కోరింది. దీనిపై వాదనలు విన్న కోర్టు అమిత్ అరోరాను 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది.

Amit Arora in Delhi liquor case
Amit Arora in Delhi liquor case

Amit Arora In Delhi Liquor Case: దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఏడు రోజుల ఎన్​ఫోర్స్​మెంట్ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతించింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సన్నిహితుడైన అమిత్​ను అదుపులోకి తీసుకున్న ఈడీ.. 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు ఏడు రోజులకు అనుమతించింది. దిల్లీ మద్యం స్కామ్​లో అమిత్ అరోరా పాత్రను కోర్టుకు తెలిపిన అధికారులు ఆయన రూ. 2.50 కోట్లు లంచం వసూలు చేశాడని తెలిపింది.

ఇప్పటికే ఈడీ తనను 22 సార్లు ప్రశ్నించిందని తెలిపిన అమిత్ .. విజయ్ నాయర్, సిసోదియాను ఎప్పుడూ కలవలేదని కోర్టుకు తెలిపారు. దీంతో 22సార్లు ప్రశ్నించాక కస్టడీ అవసరం ఏంటని ఈడీని కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈడీ.. మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేశామని సమగ్ర దర్యాప్తు కోసమే కస్టడీకి కోరుతున్నట్లు తెలిపింది. దీంతో న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. గురుగ్రామ్ లోని బుడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్​గా ఉన్న అమిత్​ను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

తాజా అరెస్టుతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం నలుగురిని అరెస్టు చేసింది. మరో ఇద్దరిని సీబీఐ కస్టడీ నుంచి అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇటీవల మూడువేల పేజీలతో ఛార్జ్​షీట్​ను దాఖలు చేసింది. ఇందులో సమీర్​ను ఏ1గా పేర్కొన్న దర్యాప్తు వర్గాలు.. సిసోదియా పేరు మాత్రం చేర్చలేదు. అటు సీబీఐ కూడా ఎఫ్​ఐఆర్​లో సిసోదియా పేరును చేర్చగా.. ఛార్జ్​షీట్​లో మాత్రం నమోదు చేయలేదు.

ఇవీ చదవండి: దిల్లీ మద్యం కేసు.. శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబులకు 14 రోజుల కస్టడీ

ఎక్సైజ్​ పాలసీ కేసు ఫేక్​.. 800 మంది దాడి చేసినా ఏం లభించలేదు : కేజ్రీవాల్

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో వాడీవేడిగా కొనసాగిన వాదనలు.. విచారణ వాయిదా

'PFIపై నిషేధం కరెక్టే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.