నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా సర్కారు ప్రయత్నాలు చేస్తోందని తెరాస యువనేత తలసాని సాయికిరణ్ అన్నారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నియోజకవర్గానికి 15 కేఫ్‌లను మంజూరు చేసి ఒక్కొక్క కేఫ్‌ను 10 మంది కలిసి నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ తెరాస నేత తలసాని సాయి కిరణ్ వెల్లడించారు. ఒక్కో కేఫ్‌కు 3లక్షల రుణం ఇప్పించి నెలవారి వాయిదాల పద్ధతిలో రుణం తీర్చుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో నిరుద్యోగులను ఎంపిక చేసి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: స్వయం ఉపాధే లక్ష్యం