ETV Bharat / state

మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం

author img

By

Published : Aug 24, 2020, 5:43 AM IST

Updated : Aug 24, 2020, 7:37 AM IST

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో అసువులు బాసిన ఇంజినీర్ల ఆఖరి సంభాషణ అందరి గుండెల్ని పిండేస్తోంది. ప్రాణాలకు తెగించి విద్యుత్‌ ప్లాంటును రక్షించిన వారి గుండె ధైర్యానికి అందరూ సలాం కొడుతున్నారు. అటు ఈ దుర్ఘటనపై సీఐడీ రెండో రోజూ విచారణ కొనసాగింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నామని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు.

మృత్యువు ముంచుకొస్తున్నా... విధి నిర్వహణ వీడలేదు
మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం

మృత్యువు ముంచుకొస్తున్నా... సడలని సంకల్పం

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఐడీ అధికారుల విచారణ రెండో రోజూ కొనసాగింది. ఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్న అధికారులు.. బ్యాటరీలు నిల్వ చేసిన ప్రదేశం, మేన్ కంట్రోల్ రూం సహా ప్రమాదం జరిగిన స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. విచారణ జరుగుతున్నందున వాటిని సీజ్ చేసి ఉంచారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఏసీలో ఉంటుందని.. దాన్ని డీసీలోకి మార్చే ప్యానెల్ల వద్ద షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక విద్యుత్ కేంద్రంలోకి సీపేజ్ వాటర్ రావడం వల్ల సిబ్బంది దాన్ని ఎత్తిపోసే పనిలో పడ్డారు. విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

వారి మాటల్లోనే తెలుస్తోంది.. వారి సాహసం

విద్యుత్​ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో అసువులు బాసిన ఏఈలు సుందర్ -మోహన్ సంభాషణ చరవాణిలో రికార్డయింది. విద్యుత్ ప్లాంట్‌కు ఎలాంటి ప్రమాదం జరకూడదని వారు ప్రాణాలకు తెగించి... చివరి వరకూ ఎంతలా ప్రయత్నించారో ఈ మాటలు వింటే అర్థమవుతోంది.

ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు

ఇంజినీర్లు, ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్లాంటును సురక్షితంగా ఉంచారని ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఇంజినీర్లు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారని... నీళ్లు యూనిట్‌లోనికి వస్తే మొత్తం ప్లాంటు మునిగిపోయేదని తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్న ఆయన.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'

Last Updated : Aug 24, 2020, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.