పీఆర్సీపై సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటన జారీ చేచారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ను ఇస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీపై సీఎం ప్రకటనను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షం వ్యక్తం చేశాయి.
సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. పదవీ విరమణ వయసు పెంపు సంతోషమని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. ఉద్యోగులు గౌరవంగా పనిచేసుకునేలా చేశారని వ్యాఖ్యానించారు. వయోపరిమితి పెంపు, ఒప్పంద ఉద్యోగులకూ వర్తింపజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల తరఫున సీఎంకు టీజీవో అధ్యక్షురాలు మమత ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని రుజువైందని అన్నారు. పొరుగు సేవల సిబ్బందికి జీతాలు పెంచడం గర్వకారణమని వెల్లడించారు. పదవీ విరమణ వయసు పెంచి గొప్పదనాన్ని చాటుకున్నారని కొనియాడారు.
ఇదీ చూడండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు