ETV Bharat / state

కంపెనీ ఎండీపై ఉద్యోగులు హెచ్​ఆర్సీలో ఫిర్యాదు - animation company MD Thapas Chakraborty

'' 16 నెలల నుంచి జీతాలు లేవు.. 1400 మంది రోడ్డున పడ్డారు. ఒక్కొక్కరికి 14 లక్షలు రావాలి. వేతనాలు అడిగితే.. ఎండీ వేధిస్తున్నాడంటూ''.. ఉద్యోగులంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Employees complain to HRC about  DQ Entertainment International Pvt Company MD Thapes Chakravarty
కంపెనీ ఎండీపై ఉద్యోగులు హెచ్​ఆర్సీలో ఫిర్యాదు
author img

By

Published : Nov 3, 2020, 5:56 PM IST

డిక్యూ ఎంటర్​టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ (యానిమేషన్) ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్​కు ఆ కంపెనీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. 16 నెలల నుంచి జీతాలు లేక 1400 ఉద్యోగులు రోడ్డున పడ్డామని వారు కమిషన్​కు వివరించారు.

ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14 లక్షలు రావాలని ఉద్యోగులు తెలిపారు. ఎండీపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు గురి చేయడమే కాకుండా... కంపెనీ నుంచి తొలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీ పాస్​పోర్టు సీజ్ చేసి... అతనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని... తమకు న్యాయం చేయాలని బాధితులు కమిషన్​ను వేడుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.