Power Generation Increased In Telangana : రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యుత్ విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం రవీంధ్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో గత 9 ఏళ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు ఉంటాయి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, స్పెషల్ సీఎస్, ఎనర్జీతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను 21 రోజుల పాటు సీరియల్ బల్బులతో పూలతోరణాలతో అద్బుతంగా అలంకరించనున్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్ గురించి నాడు-నేడు పద్ధతిలో ఫ్లెక్సీల ఏర్పాటు చేయనున్నారు.
-
తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
— Telangana CMO (@TelanganaCMO) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(జూన్ 5, 2023)
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగుతున్నది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.… pic.twitter.com/M5S0LIFCGL
">తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
— Telangana CMO (@TelanganaCMO) June 5, 2023
(జూన్ 5, 2023)
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగుతున్నది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.… pic.twitter.com/M5S0LIFCGLతెలంగాణ విద్యుత్తు విజయోత్సవం
— Telangana CMO (@TelanganaCMO) June 5, 2023
(జూన్ 5, 2023)
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా అన్నిరంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగుతున్నది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.… pic.twitter.com/M5S0LIFCGL
Electricity Consumption Increased In Telangana : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి హైదరాబాద్‌కు 765 కేవీ. డీసీ లైను నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య పీజీసీఐఎల్ ఆధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడి నుంచైనా విద్యుత్‌ను ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది. రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్ జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నదని ఆశాఖ ప్రకటించింది.
- Jagdish Reddy: 'విద్యుత్‌కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోండి'
- "కేంద్రం నూతన విద్యుత్ విధానం తీసుకొచ్చినా.. ఉచిత విద్యుత్ ఆపే ప్రసక్తి లేదు'
Electricity Day In Telangana Decade Celebrations 2023 : ఉత్పత్తితో పాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. రూ.22,502 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. నేడు తలసరి విద్యుత్ వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందుంది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 69 శాతం ఎక్కువ అని ఆశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కెరెంటు : 2014-15 నుంచి 2021-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూ.36,890 కోట్ల సబ్సిడీని నాణ్యమైన విద్యుత్ కోసం ప్రభుత్వం అందించింది. రూ.39,321 కోట్లతో విద్యుత్ వ్యవస్థ, సరఫరా పంపిణీ వ్యవస్థల పటిష్ఠం చేసుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలో విద్యుత్‌పై సమీక్షించి రైతులకు నాణ్యమైన కరెంటును అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రమని విద్యుత్ శాఖ స్పష్టం చేస్తుంది.
Telangana Decade Celebrations 2023 : విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పటిష్ట పరచడంలో సిబ్బంది కీలక పాత్ర పోషించారు. దీంతో 14,160 మెగావాట్లు పిక్ డిమాండ్‌ను కూడా మీట్ చేయడం జరిగినది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం పరస్పర పనులను పవర్ హాలిడే ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు.. నేడు 24 గంటల విద్యుత్‌తో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తుంది. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు ఉంటే 2023 మార్చ్ 31 నాటికి 2126 యూనిట్లుకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికమని విద్యుత్ శాఖ స్పష్టం చేస్తుంది.
ఇవీ చదవండి: