ETV Bharat / state

Be Alert: వర్షంలో పారాహుషార్​... పొంచి ఉన్న విద్యుత్తు ప్రమాదాలు

వానలతో విద్యుత్తు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. జీహెచ్‌ఎంసీ, మెట్రో నిర్లక్ష్యంతో రెండు రోజుల క్రితం రాత్రిపూట నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద పాదబాట రెయిలింగ్‌ దాటబోయి విద్యుదాఘాతంతో ఒక ప్రయాణికుడు మృత్యువాతపడ్డాడు.

Electrical accidents lurking in the rain
వర్షంలో పొంచి ఉన్న విద్యుత్తు ప్రమాదాలు
author img

By

Published : Sep 6, 2021, 8:10 AM IST

  • విద్యుతు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సరైన ఎర్తింగ్‌ లేకపోవడం, తీగలు వదులుగా ఉండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
  • నేల తడిగా ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విద్యుత్తు స్తంభాలను తాకినా షాక్‌ కొట్టే ప్రమాదం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని చేతితో తాకరాదు.
  • నీరు ఉన్నచోట విద్యుత్తు తీగలు, పరికరాలను ఉంచరాదు. తడి చేతులతో అసలే తాకరాదు.
  • స్విఛ్‌ ఆఫ్‌ చేయకుండా ప్లగ్‌లను సాకెట్ల నుంచి బయటికి తీయరాదు. వైరును పట్టుకుని ప్లగ్‌లు తీయొద్ధు.
  • ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు భవనానికి దగ్గరగా ఉండే విద్యుత్తు తీగలను గమనిస్తూ ఉండాలి.
  • ప్రమాదకరంగా ఉంటే తీగలను దూరంగా మార్చాలని డిస్కం దృష్టి తీసుకెళ్లొచ్ఛు.
  • ముందుజాగ్రత్తగా ప్లాస్టిక్‌ తొడుగులు వేయించుకోవచ్ఛు.
  • దుస్తులు ఆరేసేందుకు ఇనుప తీగలు ఉపయోగించవద్ధు.
  • రహదారిపై వెళ్లేటప్పుడు దారిలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • చిన్నారులు వీటికి దూరంగా నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఇంట్లో స్విచ్చు బోర్డుల నుంచి వాననీరు కారుతున్నట్లయితే చేతితో తాకవద్ధు.

వానలో స్తంభాలను తాకొద్దు: జి.రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

వర్షం కురిసేటప్పుడు విద్యుత్తు లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడొద్ధు రహదారిపై నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్తు తీగలు, పరికరాలు మునిగి ఉంటే ఆ నీటిలోకి పోరాదు. కిందకు వంగిన, కూలిన విద్యుత్తు స్తంభాలు, తీగలకు దూరంగా నడవాలి. విద్యుత్తుకు సంబంధించి అత్యవసర పరిస్థితి ఉన్నపుడు 1912/100/స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీసుతో పాటూ విద్యుత్తు కంట్రోల్‌ రూం నంబర్లు 7382072104/106, 1574 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్ఛు.

ఇదీ చూడండి: KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.