వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (ysr telangana party)భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ షర్మిల దృష్టిసారించారు. అందులో భాగంగా పార్టీ విస్తరణ, వచ్చే నెల 20 నుంచి చేపట్టనున్న పాదయాత్ర రూట్‌మ్యాప్ తదితర అంశాలపై ప్రశాంత్‌కిశోర్ టీంతో వైఎస్ షర్మిలతో భేటీ (prashant kishor team meet ysrtp chief ys sharmila) అయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలపై చర్చించినట్లు వైఎస్ఆర్టీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చించినట్లు వైఎస్ఆర్టీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీసీ గౌరవ సభ పోస్టర్ విడుదల..
వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో అక్టోబర్ 3న బీసీగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీగౌరవ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ ఆవిష్కరించారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో..
ఏడేళ్లలో తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బీసీల అభివృద్ధిని.. తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll) నిరుద్యోగుల తరఫున నామినేషన్లను వేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీనీ ఏర్పాటు చేసింది.
షర్మిల పాదయాత్ర ఇలా...
ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు గతంలోనే వైఎస్ షర్మిల (YSRTP President YS Sharmila) ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగుతుందని... జీహెచ్ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12 - 15 కి.మీ మేర పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి... చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.
పాదయాత్రలకు వైఎస్ఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని.. ఆయన ఆశయాలు సాధించేందుకే పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్‌కు భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఎలా అమ్ముడుపోయాయో పాదయాత్రలో ప్రజలకు చెబుతామని షర్మిల చెప్పారు. ప్రతి పల్లెకు వెళ్లి.. ప్రతి గడపా తడతామని స్పష్టం చేశారు.
ఏపీలోనూ పీకే బృందం మరోసారి..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీం మరోసారి ఏపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాజాగా తమిళనాడులో డీఎంకే, బంగాల్లో టీఎంసీని విజయతీరాలకు చేర్చేందుకు వ్యూహాలు రచించిన పీకే.. మరోసారి ఏపీలో జగన్‌తో జట్టుకట్టనున్నారు. 2019 ఎన్నికల్లోనూ జగన్ విజయానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచించారు.
ఇదీచూడండి: YS Sharmila Padayatra: అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర.. చేవెళ్లలో ప్రారంభం