ETV Bharat / state

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు - తెలంగాణలో బస్టాండ్‌లు రద్దీ

Election Effect at Bus Stands in Telangana : రాష్ట్రంలో ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలలో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ వంటి నగరాలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉన్న ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు పయనమయ్యారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ జీవనం సాగిస్తున్న చాలా మంది ఓటర్లు.. తమ ఓటు హక్కను వినియోగించుకునేందుకు వచ్చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్ స్టాండ్‌లు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోతున్నాయి.

Bus Stands Rush in Telangana
Bus Stands Rush
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 4:31 PM IST

Updated : Nov 29, 2023, 5:03 PM IST

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

Election Effect at Bus Stands in Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రజలు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే సొంతూళ్లకు బయలుదేరారు. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా విద్యాసంస్థలకు నేడు, రేపు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుటుంబాలతో వెళ్తుండగా బస్ స్టాండ్‌లలో రద్దీ కనిపిస్తోంది. అలాగే గత రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించడం లేదు.

పనుల కోసం వలన వెళ్లిన ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కుటుంబ సభ్యులను కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించిన విషయం తెలిసిందే. సొంతూళ్లో ఓటు ఉన్నవాళ్లు తప్పకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకోసం రవాణా సదూపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Bus Stands Rush in Telangana : హైదరాబాద్ సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన ఓటర్లు నివసిస్తుంటారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్, బీఎన్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉంటున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల వారు ఎల్బీనగర్, ఉప్పల్ వైపు.. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

ఎన్నికల్లో మీ ఓటు ఇంకొకరు వేశారా - ఇలా చేస్తే మీ హక్కు మీరే వినియోగించుకోవచ్చు

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు(Candidates) ఈసారి వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు డైలీ ఫోన్లు చేసి మరీ ఎప్పుడొస్తున్నారని ఆయా పార్టీల లోకల్ లీడర్లు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులను కూడా అడుగుతున్నారు. పోలింగ్ రోజు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఓటర్లకు సైతం భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు.. వలస ఓటర్లను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. అంతా సొంతూళ్లకు బయలుదేరడంతో ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అన్ని బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. చాలామంది ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పెరిగిన రద్దీ సాకుతో ఛార్జీలు అమాంతం పెంచేశారు.

కాగా సొంతూళ్లకు పోయే వాళ్లంతా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళితే మంచిదే. కానీ ఇక్కడ ఓటు హక్కును కలిగి ఉండి రెండు రోజులు సెలవు వచ్చిందని ఓటు హక్కును వినియోగించుకోకుండా విహార యాత్రలకు వెళితే మాత్రం ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కను కొల్పోతాం. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఇంకా తెలియక పోవడం శోచనీయం భావించాలి. మొత్తానికి తరలి వస్తున్న ఓటర్లతో పట్టణాల్లో, గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్న విందులు, వినోదాలతో సందడిగా ఉంది.

శాసనసభ పోలింగ్​కు సర్వం సన్నద్ధం - ఓటేసేందుకు ఇందూరు సిద్ధం

మేడ్చల్-మల్కాజి​గిరిలో పోలింగ్​ కేంద్రాలకు సర్వం సిద్ధం - ఓటేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Last Updated : Nov 29, 2023, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.