పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి పరిశీలకునిగా మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం అదనపు డైరెక్టర్ జనరల్ హర్ ప్రీత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గానికి పరిశీలకునిగా యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్.. ఇద్దరు అధికారులకు లేఖలు పంపారు.
ఇదీ చదవండి: తెరాస నేతలతో రేపు కేటీఆర్ కీలక సమావేశం