హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం క్రీడా ప్రేమికులతో నిండిపోయింది. ఈనాడు ఈతరం క్లబ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న క్రీడలను వీక్షించేందుకు క్రీడాకారులు భారీగా హాజరయ్యారు. ఇవాళ రెండో రోజు.. కబడ్డీ, కోకో, వాలీబాల్, చెస్, బాడ్మింటన్లలో సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనపరుస్తున్నారు. సాయంత్రం ఆయా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన జట్లకు బహుమతులను అందజేయనున్నారు.
ఇవీ చదవండి.. 'సరూర్నగర్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019'