ETV Bharat / state

ఈనాడు పత్రిక డిజిటల్​ పైరసీ​.. పోలీసులకు ఫిర్యాదు

సామాజిక మాధ్యమాల ద్వారా ఈనాడు దినపత్రికను డిజిటల్​ పైరసీ చేశారంటూ ఉషోదయ ఎంటర్​ప్రైజెస్​ న్యాయ విభాగం ఛీఫ్​ మేనేజర్​ రత్నకుమార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

author img

By

Published : Apr 1, 2020, 6:17 AM IST

eenadu paper complaint on  digital piracy at Hyderabad
ఈనాడు దినపత్రిక డిజిటల్​ పైరసీ​.. పోలీసులకు ఫిర్యాదు

సామాజిక మాధ్యమాల ద్వారా చట్ట విరుద్ధంగా ఈనాడు పత్రికను విక్రయిస్తున్న వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సప్‌, టెలిగ్రామ్‌ మెసెంజర్ల ద్వారా ఈనాడు దినపత్రికను అందజేస్తామని కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. యాభై రూపాయలు చెల్లించిన వారు మాత్రమే తమ వాట్సప్‌ బృందంలో చేరాలంటూ సైబర్‌ నేరస్థులు ప్రచారం నిర్వహిస్తున్నారని... ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ న్యాయ విభాగం ఛీఫ్‌ మేనేజర్‌ రత్నకుమార్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాట్సప్‌, టెలిగ్రామ్‌లున్న వారి నెంబర్లను తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు తెలియకుండా ఇదంతా జరుగుతోందని... గత నెల 29న ఈ ప్రచారాన్ని గుర్తించామని, వాట్సప్‌ బృంద సభ్యులకు ఈనాడు దినపత్రికతో పాటు ఆదివారం అనుబంధ వార పత్రికను కూడా డిజిటల్‌ రూపంలో పోస్టు చేశారని వివరించారు. ఈనాడు దినపత్రిక డిజిటల్‌ ఎడిషన్‌ను తాము వాట్సప్‌, టెలిగ్రామ్‌లో నెటిజన్లకు అందుబాటులో ఉంచామని రత్నకుమార్​ తెలిపారు. తమ పత్రికను డిజిటల్‌ పైరసీ చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.