ఈనాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ అమీర్‌పేటలోని కమ్మసంఘం భవనంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్- 2020 ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఫెయిర్‌లో విదేశాల్లో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గైడెన్స్ ఇచ్చేందుకు 20కి పైగా పేరెన్నికగన్న కన్సల్టెన్సీలు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొంటున్నాయి. యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దాదాపు 25కు పైగా దేశాల్లో ఉన్న 500కు పైగా యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు ఉన్న అవకాశాలు, ఉద్యోగావకాశాలు, వీసా ప్రాసెసింగ్, నిబంధనలకు సంబంధిచిన వాటిపై అభ్యర్థులకు మార్గదర్శనం చేస్తున్నారు.
విదేశీ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి.. విదేశీ విద్యకు ఉన్న అవకాశాలు, వారికున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్, విదేశ్ కన్సల్టెన్స్, నెక్సస్, సాంటామోనికా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓవర్సీస్లో ఉన్న అవకాశాలపై మార్గదర్శనం చేస్తున్నారు.
ఇవీ చూడండి: గిరిజనుల వద్ద ఆస్తులు లేకున్నా ఆనందముంది: అర్జున్ ముండా