ETV Bharat / state

పక్కా ప్రణాళిక.. 8 నెలలు.. 121 ఇళ్లు..! - kerala floods 2018

ఇళ్లు కట్టించాలన్న ఉద్దేశం మంచిదే అయినా...అసలు ఎవరు నిజమైన బాధితులు అన్నది తెలుసుకోవటమే ముఖ్యమైన అంశం. ఇక ఇళ్లు కట్టేందుకు స్థలాల ఎంపిక కూడా కీలకమే. వీటిలో చిన్న పొరపాటు జరిగినా చిక్కులు తప్పవు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోయింది.. కేరళలో వరద బాధితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం. ఇందుకు కారణం...ముందుగానే స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లటమే. మళ్లీ ఏదైనా విపత్తు ముంచుకొచ్చినా సమస్య తలెత్తకుండా ఇళ్లు కట్టించాలన్న లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడటం రామోజీ గ్రూపు సాధించిన గొప్ప విజయం.

Eenadu constructed 121 houses to kerala flood victims in 8 months
కేరళ వరద బాధితులకు ఇళ్లు
author img

By

Published : Feb 8, 2020, 11:07 PM IST

Updated : Feb 8, 2020, 11:18 PM IST

కేరళ వరద బాధితులకు ఇళ్లు

కేరళలో వరద బాధితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణం పూర్తవటంలో నాటి అలప్పుజ సబ్‌ కలెక్టర్ కృష్ణతేజది కీలక పాత్ర. వరదల సమయంలో ఎదుర్కొన్న అనుభవాలు దృష్టిలో ఉంచుకుని...ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేశారు. మిగిలిన ఇళ్లతో పోలిస్తే ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఇంటి నిర్మాణం కోసం ఎంపిక చేశారు. అంతేకాక సముద్రమట్టానికి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల ఎత్తుగా ఉండేలా ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు వహించారు. తద్వారా ఈ సారి వరదలు వచ్చినా ఇంటికి ఏ మాత్రం నష్టం కలగకుండా వెసులుబాటు కల్పించారు.

సంప్రదాయ నిర్మాణ శైలికి భిన్నంగా..

నిర్మాణం పూర్తైన ఇంటి ప్రదేశాలు జియో ట్యాగింగ్ చేయటం ద్వారా వాటి సమాచారాన్ని విపత్తు నిర్వహణ విభాగంలో పొందుపరచనున్నారు. ఫలితంగా...ఆ ప్రాంతంలో ప్రకృత్తి విపత్తులు సంభవిస్తే ఆ ఇళ్లే సహాయక కేంద్రాలుగా నిలుస్తాయి. కేరళ సంప్రదాయ గృహ నిర్మాణ శైలి సైతం గతేడాది వరదల్లో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. కారణం ఇక్కడ ఇళ్ల పైకప్పులన్నీ

గోపురాల్లా...త్రిభుజాకారంలో నిర్మించటం వల్ల హెలికాప్టర్ ద్వారా ప్రజలను తరలించటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆహారం అందించటానికీ వీలు పడలేదు. అందుకే...ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా ఈనాడు ఇళ్లను సమతలంగా ఉండే పైకప్పులతో నిర్మించారు. భవిష్యత్‌లో ప్రకృతి విపత్తులు ఎదురైతే..వీటిపై హెలికాప్టర్‌లు నిలిపేలా నిర్మాణం చేపట్టారు.

గ్రామస్థాయి సమావేశాల్లో ఎంపిక ప్రక్రియ

లబ్ధిదారుల ఎంపిక ఈ ఇళ్ల నిర్మాణంలో కీలక దశ. నిజమైన బాధితులను గుర్తించి... వెచ్చించిన ప్రతీ పైసా వారికి ఉపయోగపడేలా ఉండాలనే లక్ష్యంతో స్థానిక సంస్థలను రామోజీ గ్రూప్ భాగస్వామ్యం చేసింది. కేరళలో ఎంతో బలోపేతంగా ఉండే అలప్పుజ జిల్లాలోని స్థానిక పంచాయతీలు, పురపాలక సంస్థలు తమ ప్రాంతాల్లోని అర్హులను ఎంపిక చేశాయి. గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి ఇల్లు తిరిగి కట్టుకోలేని నిరుపేదలను ఏకగీవ్రంగా ఎంపిక చేశాయి. రామోజీ గ్రూప్‌, కుటుంబశ్రీకి ఈ సమాచారం అందించారు. అలా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 121 అర్హులైన, నిరుపేదలైన వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచి సొంతింటి కలను నిజం చేసింది.

8 నెలల్లోనే తుది అంకానికి...

2019 మార్చిలో ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం...8 నెలల్లోనే తుది అంకానికి చేరుకుంది. కుటుంబ శ్రీ సంస్థతో ఒప్పందం ప్రకారం 116 ఇళ్లే నిర్మించాల్సి ఉన్నా నాణ్యతలో రాజీ పడకుండానే పొదుపుగా ఖర్చు చేసి మిగిలిన డబ్బుతో మరో ఐదు ఇళ్లు అదనంగా కట్టగలిగారు. ఇలా మొత్తం 121 ఇళ్ల నిర్మాణం పూర్తైంది. ఇందుకు కావాల్సిన వస్తువులు, సామగ్రిని కొందరు స్థానిక వ్యాపారులే అందించారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన ప్రతి పనినీ పర్యవేక్షించేందుకు పంచాయతీ, పురపాలక స్థాయిలో కుటుంబ శ్రీ సంస్థ పర్యవేక్షణా కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రతి పైసా సరైన విధంగా ఖర్చైంది.

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన తమకు రామోజీ సంస్థ అందిస్తున్న ఈ నూతన గృహాలపై అలప్పుజ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ మానసిక వేదన అర్థం చేసుకుని సాయమందించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. అనుకోని విధంగా వరదలు తమ జీవితాల్ని అస్తవ్యస్తం చేసినా...తెలుగు రాష్ట్రాల ప్రజలు తమను ఆదుకోవటం పట్ల ఆనందంగా ఉన్నారు. దైవం మానుష రూపేణ అనే సూక్తికి రామోజీ గ్రూప్ చేసిన సాయం తార్కాణమని కొనియాడుతున్నారు.

ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

Last Updated : Feb 8, 2020, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.