ప్రభుత్వ పాఠశాలలలో విద్యా పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ విమర్శించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక- తల్లుల సంఘము నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు... ఉపాధ్యాయులపై పర్యవేక్షణ ఉండాలంటే విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లల తల్లులు కూడా విద్యాహక్కు అమలు, నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పోరాటాలు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: హైదరాబాద్ పోలీసుల చెరలో బ్లఫ్‌మాస్టర్