ఏ విద్యార్థి ఏ పాఠశాలలో చదువుతున్నాడు?.. అసలు చదువుతున్నాడా? లేదా? అని ట్రాకింగ్ చేసేందుకు ప్రతి ఒక్కరికీ ఆధార్ సంఖ్య (Aadhar number) ఇవ్వడమే కాకుండా ఛైల్డ్ ఇన్ఫో (Child Info)లో నమోదు చేయాలన్న లక్ష్యం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. కరోనా రెండో దశ అనంతరం ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసలు అధికంగా ఉండటం.. కొందరు అసలు బడి మానేస్తున్న పరిస్థితి తలెత్తడంతో పాఠశాల విద్యాశాఖ మరోసారి ఆధార్ సంఖ్య (Aadhar number)ను ఛైల్డ్ ఇన్ఫో (Child Info)కు అనుసంధానం చేయడంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 59 లక్షలు ఉండగా వారిలో 53 లక్షల మంది ఆధార్ సంఖ్య (Aadhar number)ను ఛైల్డ్ ఇన్ఫో (Child Info)కు అనుసంధానం పూర్తి చేశారు. ఇంకా ఆరు లక్షల మంది ఆధార్ సంఖ్య (Aadhar number) నమోదు చేయలేదని అధికారులు తాజాగా లెక్కలు తీశారు. వారిలో 2 లక్షల మందికి అసలు ఆధార్ (Aadhar number) లేకపోయి ఉండొచ్చని అంచనా. మిగిలిన నాలుగు లక్షల మందికి ఆధార్ ఉన్నా వాటిని ఆయా బడుల ప్రధానోపాధ్యాయులు ఛైల్డ్ ఇన్ఫో (Child Info)లో నమోదు చేయలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఆధార్ (Aadhar number) నమోదుపై హైదరాబాద్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేకంగా పరికరాలు ఇచ్చినా...
విద్యార్థులందరికీ 2017 సెప్టెంబరు నాటికే ఆధార్ సంఖ్య (Aadhar number) ఉండాలన్నది లక్ష్యం. అది గడిచి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. దాన్ని సాధించేందుకు 2018లోనే పాఠశాల విద్యాశాఖ ఆధార్ పరికరాలను సమకూర్చుకుంది. వాటిని ఆయా ఎంఈవో కార్యాలయాల్లో ఉండే ఎంఐఎస్ సమన్వయకర్తలకు అందజేసి ఎలా వాడాలో శిక్షణ కూడా ఇచ్చారు. వారు పాఠశాలలకు వెళ్లి ఆధార్ (Aadhar number) లేని వారికి కొత్తగా నమోదు చేయించాలి. కానీ ఆ ప్రక్రియ అంతంతమాత్రంగా కొనసాగింది. కరోనాతో గత విద్యా సంవత్సరం పూర్తిగా ఆగిపోయింది. ఈ ఏడాది దాన్ని మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఛైల్డ్ ఇన్ఫో అంటే?
ఏ పాఠశాలలో ఏ విద్యార్థి ఏ తరగతి చదువుతున్నాడు? తల్లిదండ్రులు, ఫోన్ సంఖ్య తదితర వివరాలు ఛైల్డ్ ఇన్ఫో (Child Info) పోర్టల్‌లో నమోదు చేయాలి. అది ప్రధానోపాధ్యాయుల బాధ్యత. ఒకవేళ ఆ విద్యార్థి ఇతర పాఠశాలకు వెళ్లి అక్కడ చేరితే ఆధార్ సంఖ్య (Aadhar number)ను నమోదు చేయాలన్నా కుదరదు. పాత బడిలో ఆధార్ (Aadhar number)ను తొలగిస్తేనే మరోచోట ప్రవేశం పొందేందుకు వీలవుతుంది. దానివల్ల విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది.
ఇవీ చూడండి: