ETV Bharat / state

TET results: టెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా.. - జులై ఒకటిన టెట్ ఫలితాలు

TET results: టెట్ అభ్యర్థులకు శుభవార్త. ఈనెలలో నిర్వహించిన టెట్​ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జులై ఒకటిన ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.

TET results
TET results
author img

By

Published : Jun 28, 2022, 4:07 PM IST

TET results:ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు జులై 1న విడుదల కానున్నాయి. ఈనెల 27నే ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్​లో పేర్కొన్నప్పటికీ ప్రకటించలేదు. ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్యర్యంలో ఆ శాఖపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో టెట్ ఫలితాల అంశం కూడా చర్చకు వచ్చింది. జాప్యం చేయకుండా జులై 1న ఫలితాలు విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈనెల 12న జరిగిన పరీక్షల్లో పేపర్ వన్ 3 లక్షల 18 వేల 506 మంది.. పేపర్ టూకి 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు.

ప్రాథమిక సమాధానాలపై వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్ వన్ పై 7 వేల 930.. పేపర్ టూపై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. తుది కీ ఇంకా విడుదల కాలేదు. ఫలితాలతో పాటు తుది సమాధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, టెట్ కన్వీనర్ రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.