ETV Bharat / state

ఎడ్​సెట్​ షెడ్యూల్​ విడుదల... పరీక్ష ఎప్పుడంటే? - Edcet Exam Latest News

తెలంగాణలో ఎడ్​సెట్ షెడ్యూల్​ ఖరారైంది. ఈనెల 20న నోటిఫికేషన్... 24 నుంచి ఏప్రిల్​ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ... మే 23న పరీక్ష, జూన్​ 11న ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎడ్​సెట్​ కమిటీ సభ్యులు తెలిపారు.

Council Of Higher Education
Council Of Higher Education
author img

By

Published : Feb 17, 2020, 6:16 PM IST

ఎడ్​సెట్​ షెడ్యూల్​ విడుదల... మే 23న పరీక్ష

బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్​సెట్​ పరీక్ష షెడ్యూల్​ విడుదలైంది. ఈనెల 24 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని ఎడ్​సెట్​ కమిటీ సభ్యులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 450 రూపాయలు.. బీసీ, ఓసీలు 650 రూపాయలు పరీక్ష రుసుము చెల్లించాలన్నారు.

రూ. 500 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 25 వరకు, వెయ్యి రూపాయల రుసుముతో ఏప్రిల్ 30 వరకు, 2వేల రూపాయలతో మే 4 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉందని వెల్లడించారు. మే 23న ఎడ్​సెట్ పరీక్ష నిర్వహిస్తామని... జూన్ 11న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎడ్​సెట్​ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

ఇవీ చూడండి : దేశాభివృద్ధికి నీటి సంరక్షణ ఎంతో ముఖ్యం: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.