ETV Bharat / state

భారతీ సిమెంట్స్‌ స్థిర చరాస్తులపై సుప్రీంకోర్టులో విచారణ.. ధర్మాసనం ఏం చెప్పిదంటే? - Cases against Bharti Cements

YS Bharti Cements Trial in the Supreme Court: ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మసనం.. అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Supreme Court
Supreme Court
author img

By

Published : Feb 6, 2023, 10:11 PM IST

YS Bharti Cements Trial in the Supreme Court: భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల విషయంలో భారతీ సిమెంట్స్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ధర్మాసనం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీ సిమెంట్స్‌ను ఆదేశించింది. ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకొని ఆస్తులు, ఎఫ్‌డీలను విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంకు హామీ తీసుకున్న తర్వాత కూడా రూ.150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. అయితే, ఎఫ్‌డీలను జప్తు చేసుకోలేదని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ కోర్టుకు తెలిపారు.

ఎఫ్‌డీలను జప్తు చేశారో? లేదో? అన్న వివరాలతో వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని భారతీ సిమెంట్స్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను తాము కూడా పరిశీలించి తగిన సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి అత్యున్నత ధర్మాసనం ఆమోదం తెలిపింది. ప్రతివాదిగా ఉన్న భారతీ సిమెంట్స్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.