ETV Bharat / state

Vote For Note Case: ఎంపీ రేవంత్​రెడ్డి సహా ఆరుగురిపై ఈడీ ఛార్జ్​షీట్​ - ఎంపీ రేవంత్​ రెడ్డి వార్తలు

ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహా ఆరుగురిపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ED) అభియోగపత్రం దాఖలు చేసింది. నామినేటేడ్​ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్​కు ముడుపులు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నిందితులు కుట్రపన్నినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. తన తండ్రిని గెలిపించేందుకు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రూ.50 లక్షలు నిందితులకు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

ed files charge sheet against on mp revanth

author img

By

Published : May 27, 2021, 10:44 PM IST

ఓటుకు నోటు కేసులో(vote for note case) ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్​ను నిందితులుగా పేర్కొంది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా(tdp) అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కుట్ర జరిగినట్లు ఈడీ వెల్లడించింది.

తెలంగాణ అవినీతి నిరోధక సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్(charge sheet) ఆధారంగా మనీలాండరింగ్(money laundering) నిరోధక చట్టం ప్రకారం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రేవంత్ రెడ్డి(revanth reddy), ఉదయ్ సింహా, సెబాస్టియన్, వేం నరేందర్ రెడ్డి తదితరులను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసిన.. పలు ఆధారాలతో గురువారం నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం సమర్పించింది.

వేం నరేందర్ రెడ్డికి మద్దతుగా ఓటేసినా లేదా ఓటింగ్ దూరం ఉన్నా రూ.5 కోట్లు లంచం ఇస్తామని నిందితులు పేర్కొని.. 2015 మే 30న రూ.50 లక్షలు ఇచ్చారని ఈడీ పేర్కొంది. తన తండ్రి వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు ఆయన కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రూ.50 లక్షలు సమకూర్చినట్లు ఈడీ వెల్లడించింది. అనిశా స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలను తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

ఇదీ చూడండి: patient dead: విరించి వద్ద కరోనా మృతుడి బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.