ETV Bharat / state

'ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థికంగా కొంత కోలుకుంటాము' - 'ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థికంగా కొంత కోలుకుంటాము'

ప్రధాని మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థిక రంగం కొంత మేర కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రతి ఒక్కరూ పన్నలు చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు.. ఉపశమనం కలుగుతుందంటున్న ఆర్థిక విశ్లేషకులు నమః శివాయతో ఈటీవీ ముఖాముఖి...

economic analyst interviewby etv bharat
'ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థికంగా కొంత కోలుకుంటాము'
author img

By

Published : May 13, 2020, 12:23 PM IST

Updated : May 13, 2020, 1:08 PM IST

1. ప్రధాని ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకెజ్​.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా గట్టెక్కించగలదని మీరు భావిస్తున్నారు?

ఇంత ఎక్కువ మొత్తంలో ప్యాకేజ్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. 2008లో వచ్చిన సంక్షోభానికి రూ. లక్ష కోట్లు కేటాయించారు. ప్రత్యక్షంగా నగదు సహాయం అందించకపోవచ్చు.. వివిధ రకాల్లో ప్రజలకు సాయం అందుతుంది.

2. 20 లక్షల కోట్ల భారీ ప్యాకెజ్​... ప్రజలకు ఎటువంటి ఉపశమనం ఇస్తుందనుకుంటున్నారు?

అందరికీ సహాయం చేస్తాను అని ప్రధాని ప్రకటించారు. కొన్ని రంగాలకు ప్రభుత్వం హామీ ఇచ్చి.. ఆయా రంగాలకు రుణాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా వాటిపై పూర్తి వివరాలు లేవు. కానీ జపాన్, అమెరికా తర్వాత... జీడీపీలో పది శాతం ఆర్థిక సాయాన్ని ప్రకటించడంలో మన దేశం ముందుంది.

3. ఈ ఆర్థిక సహాయం ప్రత్యక్షంగా ఉంటుందా? పరోక్షంగా ఉంటుందా?

చాలా వరకు పరోక్షంగానే ఉండచ్చు. కానీ అంతా ప్రభుత్వమే చేయలేదు. ప్రజలవైపు నుంచి కూడా చైతన్యం వస్తే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం మరింత సులభతరం అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి నుంచి కొంత కదలిక వచ్చి పన్నులు సకాలంలో చెల్లిస్తారని ఆశిస్తున్నాను.

4. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వారికి ఎలాంటి తోడ్పాటు అందించాలని మీరనుకుంటున్నారు?

సరఫరా గొలుసు నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది. పొలాల్లో పంట పండుతున్నా... విక్రయించలేకపోతున్నారు. ఈ విధానం మెరుగుపడితే.. రైతుల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. తాను చెప్పిన పంట పండిస్తే రైతుబంధు ఇస్తానంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అద్భుతంగా ఉంది. రైతులు చుట్టూ పది మంది ఏం పంట వేస్తే... అదే పండిస్తారు. అలా కాకుండా సీఎం విధానాలు పాటించడం సరైన పద్ధతని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు భారత్​ నుంచే ఆహారం వెళ్తోంది. ఇందువల్ల అందరూ సమిష్టిగా ఎదుర్కొంటే కరోనాను కట్టడి చేయవచ్చు.

'ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆర్థికంగా కొంత కోలుకుంటాము'

ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

Last Updated : May 13, 2020, 1:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.