ETV Bharat / state

Eamcet: ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు - telangana varthalu

ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

author img

By

Published : Jun 17, 2021, 6:09 PM IST

Updated : Jun 17, 2021, 8:38 PM IST

18:07 June 17

ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

ఎంసెట్ (Eamcet) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఉన్నత విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్ గోవర్ధన్​ వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  

గతంలో ఆన్​లైన్​ దరఖాస్తుల గడువును రెండుసార్లు పొడిగించారు. మార్చి 18న ఎంసెట్​ నోటిఫికేషన్​ వెలువడగా... మార్చి 20 నుంచి మే 18వరకు దరఖాస్తులకు గడువిచ్చారు. కొవిడ్​ నేపథ్యంలో దానిని మే 26 వరకు పొడిగించారు. అనంతరం మరోసారి జూన్​ 17వరకు గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంకా పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఇవాళ గడువును మరోసారి పొడిగించారు. 

ఇదీ చదవండి: CBSE: మార్కులెలా కేటాయిస్తారు- నిపుణుల మాటేంటి?

Last Updated : Jun 17, 2021, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.