ETV Bharat / state

నగర శివారుల్లో.. నకిలీ విత్తనాల దందా - నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠా అరెస్టు

ఖరీఫ్ సమీపిస్తుండటం వల్ల శివారుల్లో నకిలీ విత్తనాల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. అందరికి అన్నం పెట్టే రైతన్నకు బ్రాండెడ్ పేరిట నకిలీ విత్తనాలు అంటగడుతూ నిండా ముంచేస్తున్నారు. వీరి పని పట్టేందుకు సైబరాబాద్, రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు. కందుకూరు, హయత్ నగర్ పీఎస్ పరిధిలో అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో రాచకొండ ఎస్​వోటీ పోలీసులు రెండు ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట మేడ్చల్ కండ్లకోయలో విజిలెన్స్ అధికారులు మరో ముఠాను పట్టుకున్నారు. తాజాగా శామీర్ పేట్ పీఎస్ పరిధిలో శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు మరో ముఠా గుట్టును రట్టు చేశారు.

Duplicate seed business in hyderabad city suburbs
నగర శివారుల్లో.. నకిలీ విత్తనాల దందా
author img

By

Published : Jun 6, 2020, 5:16 AM IST

Updated : Jun 6, 2020, 6:26 AM IST

నగర శివారుల్లో.. నకిలీ విత్తనాల దందా

బ్రాండెడ్ కంపెనీల విత్తనాలు తక్కువ ధరకు అందిస్తామని.. మార్కెట్​లో చలామణీ అవుతున్న లేబుళ్లను కవర్లలో వాటిని నింపి రైతులను బురిడీ కొట్టస్తున్నారు. ఈ దందాపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే రూ .1.55 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.

బీటీ-3 పత్తి విత్తనాలపైనే ఆసక్తి

కలుపు మొక్కలు తీసే సమస్యను అధిగమించేందుకు రైతులు నిషేధమున్నా బీటీ-3 పత్తి విత్తనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్​ను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు గద్వాల, కర్నూలు, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి బీటీ-3 పత్తి గింజలను కొనుగోలు చేస్తున్నారు. నగర శివారుల్లోని అడ్డాల్లో యాసిడ్​లో శుభ్రం చేసి వాటిపై ఉండే దూదిని తొలగిస్తున్నారు. రంగు కలిపి ఏదో ఒక బ్రాండ్ పేరు మీద మార్కెట్ ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. విత్తన కంపెనీలు పక్కాగా నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే మార్కెట్లోకి బీటీ పత్తి విత్తనాలను విడుదల చేస్తాయి.

నాసి రకం విత్తనాలు..

100 విత్తులకు గానూ 90 మొలకెత్తితేనే నాణ్యమైన వాటిగా పరిగణించి.. ఆ బ్యాచ్​ను మాత్రమే సరఫరా చేస్తాయి. ఈ పరీక్షల్లో విఫలమైన విత్తనాలను కేటుగాళ్లు సేకరించి ఏదో ఒక బ్రాండ్ పేరిట రైతులకు అంటగడుతున్నారు. నాసి రకం విత్తనాలు కిలోకు 150 నుంచి 200 రూపాయల వరకు కొనుగోలు చేసి వాటిని శుభ్రం చేసి.. రంగులు కలిపి రెండు 150 గ్రాముల ప్యాకెట్లలో నింపుతున్నారు. ఒక్కొక్కటి 600 రూపాయలకు పైగా అమ్ముతున్నారు. ఈ లెక్కన చూస్తే కిలోకు వెయ్యి రూపాయల చొప్పున అక్రమంగా గడిస్తున్నారు. సులంభంగా ఎక్కువ ఆదాయం సమకూరుతుండటం వల్ల అక్రమార్కులు పోలీసులకు పట్టుపడినా.. మళ్లీ ఏదో ఒకచోట దందా చేస్తూనే ఉన్నారు.

ఈసారి మకాం హైదరాబాదులో

తాజాగా శామీర్​పేట్ పీఎస్ పరిధిలో చిక్కిన ప్రధాన నిందితుడు 2015 నుంచి ఈ కల్తీ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. రాచకొండ పోలీసులకు పట్టుపడిన ఓ ముఠాపై గతంలోనే ఖమ్మంలో కేసు నమోదయ్యింది. ఈసారి మకాంను హైదరాబాదు మార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మారుమూల ప్రాంతాల్లోని గెస్ట్ హౌస్​లు, తోటలు, ఇళ్లు, పాడుపడిన భవనాలు, గోదాంలను అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ఎవరికీ చిక్కకుండా ముడి సరుకును అడ్డాకు చేర్చే బాధ్యత బొలేరో డ్రైవర్లు తీసుకుంటున్నారు. ఇందుకోసం రెట్టింపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఒక్క పత్తినే కాకుండా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న, వరి నకిలీ విత్తనాలను కూడా తయారు చేస్తున్నారు.

ఇదీ చూడండి : ఓవైపు సిబ్బందితో శ్రమదానం.. మరో వైపు ఆదాయం

Last Updated : Jun 6, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.