ETV Bharat / state

పంట బీమా వల్ల.. రైతుకేది ధీమా..? - Agriculture Crop Insurance Schemes Union Government

పంట బీమా రైతులకు ధీమా ఇవ్వడం లేదు. 2019 ఖరీఫ్ సీజన్‌లో కేవలం 13.5 శాతం అన్నదాతలే బీమా చేయించారు. నిధుల విడుదల, రాయితీ చెల్లింపుల్లో జాప్యం శాపంగా మారింది. పంట బీమాను స్వచ్ఛందం చేయాలని కేంద్రం నిర్ణయించడం... శరాఘాతంగా మారింది.

due-to-crop-insurance-dot-in-telangana
పంట బీమా వల్ల.. రైతుకేది ధీమా..?
author img

By

Published : Feb 23, 2020, 5:16 AM IST

Updated : Feb 23, 2020, 7:33 AM IST

ఆరుగాలం శ్రమించే రైతులకు పంటల బీమా ఇక నుంచి ధీమా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పంట బీమా చేయించడాన్ని స్వచ్ఛందం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి పంట బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద రైతులు పంటలకు బీమా చేయిస్తున్నారు.

బీమా చేయించినా పరిహారం లేదు

2019-20 ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకునే ప్రతి రైతు... కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాలి. ఐతే బీమా చేయించినా పరిహారం రావడం లేదని అన్నదాతలు అనాసక్తి చూపిస్తున్నారు. కచ్చితంగా ప్రీమియం తీసుకోవాలనే నిబంధన ఉన్నా... 13.5 శాతం మంది రైతులే గత ఖరీఫ్‌లో బీమా చేయించారు.

రాష్ట్రంలో మొత్తం 59 లక్షల మంది రైతులు ఉంటే... 8 లక్షల మందే ప్రీమియం కట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి 50 శాతం పంటల విస్తీర్ణం... బీమా పరిధిలోకి రావాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో కనీసం 4వ వంతు పంటకైనా బీమా చేయించలేదు.

కేంద్రంపై రైతుల అసంతృప్తి

2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రీమియం చెల్లింపు రైతుల ఇష్టానికే వదిలేస్తూ కేంద్రం నిబంధనలు మార్చింది. పరిహారం రావడం లేదని ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న రైతులు... ఇకపై పంటలకు బీమా చెల్లించకపోవచ్చని వ్యవసాయాధికారులు అంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని బీమా నిబంధనలు ఉన్నాయి.

పరిహారం ఎక్కడ..?

  • నిధులు విడుదల చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం వల్ల పరిహారం చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి.
  • 2018-19 ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు 419 కోట్ల రూపాయలు పరిహారం రావాల్సి ఉంది.
  • రాష్ట్రం 205.14 కోట్ల రూపాయలు, కేంద్రం మరో 205.14 కోట్ల రూపాయలు రాయితీ కింద వ్యవసాయ శాఖకు విడుదల చేయాలి.

రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వడానికి గత నవంబరులో అనుమతించారు. ఇంతవరకూ ఈ నిధులు అందలేని... బీమా కంపెనీలు రైతులకు పరిహారం పంపిణీ చేయలేదు. రాష్ట్రం వాటా ఇస్తేనే.. తాము ఇస్తామని కేంద్రం ఊరుకుంది.

ఇవీ చూడండి: కొత్త జీహెచ్​ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Last Updated : Feb 23, 2020, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.