ETV Bharat / state

Rain Alert: 'ఆ ప్రభావంతోనే వాతావరణంలో మార్పులు.. అందుకే అతిభారీ వర్షాలు' - వాతావరణంలో మార్పులు

ఆహ్లాదానికి మారుపేరు హైదరాబాద్‌ నగరం.. అన్ని కాలాల్లోనూ అనువుగా ఉండే వాతావరణం దాని సొంతం.. అది ఒకప్పటి మాట.. ప్రస్తుతం అది అనూహ్యంగా మారుతోంది. మహానగరంపై వాతావరణ మార్పుల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఆ ప్రభావంతోనే హైదరాబాద్‌లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

climate-change-hyderabad
హైదరాబాద్​లో వాతావరణ మార్పులు
author img

By

Published : Nov 3, 2021, 7:50 AM IST

వాతావరణ మార్పులతోనే హైదరాబాద్​లో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపాతంలో వైపరీత్యంతో పాటు అధిక ఉష్ణోగ్రతలూ నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్త మార్పులకు తోడు స్థానిక వాతావరణ పరిస్థితుల దుష్ప్రభావమూ ఇందుకు నేపథ్యమవుతోంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో ఒక్క రోజులోనే భారీ వర్షపాతం రికార్డవుతోంది. వేసవి ఉష్ణోగ్రతలతో పాటు గాలిలో తేమశాతం పెరుగుతోంది. వందేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 2020 అక్టోబర్‌ నాటి కుంభవృష్టితో పాటు ఈ ఏడాదీ అదే నెలలో పడిన భారీవర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. మెట్రోనగర వాతావరణంలో మార్పుల ఫలితంగా జీహెచ్‌ఎంసీతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షపాతం నమోదవుతుండటంపై సమగ్ర అధ్యయనం అవసరమని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వేగంగా, భారీగా జరుగుతున్న పట్టణీకరణ ప్రభావమూ ఇందుకు తోడవుతోందని వారంటున్నారు.

వర్షపాతం నమోదు వివరాలు

అత్యధిక వర్షపాతం

గత ఏడాది అక్టోబర్‌ 14న హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఘట్‌కేసర్‌ సమీప సింగపూర్‌ టౌన్‌షిప్‌ ప్రాంతంలో 32.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 30 సెం.మీ., పెద్ద అంబర్‌పేటలో 29.88 సెం.మీ. కుంభవృష్టి కురిసింది. సరూర్‌నగర్‌, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, కీసర, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉప్పల్‌, సైదాబాద్‌, బండ్లగూడ. అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో 24 సెంటీమీటర్లు అంతకు మించిన కుండపోత వర్షం..అదీ 24గంటల వ్యవధిలోనే కురిసింది. నగరాన్ని అతలాకుతలం చేసింది. గత అక్టోబర్‌ 9న వివిధ ప్రాంతాల్లో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి అధిక వర్షపాత ఘటనలు పెరగనున్నాయని సంబంధిత శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

భారీ వర్షపాతం

కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదలతోనే

హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా అటవీ విస్తీర్ణం, పచ్చదనం తగ్గిపోవడం, పరిశ్రమలు పెరగడం, అదుపులే ని వాహన కాలుష్యం వంటివి ఇందుకు నేపథ్యంగా నిలుస్తున్నాయి. వాయు కాలుష్యమూ పెను ప్రభావం చూపుతోంది. వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతో క్లోరోఫోరా కార్బన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మీథేన్‌ తదితర వాయువులన్నీ వాతావరణంలో భారీగా చేరి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతినరుల్లో భాగమైన కొండలు, గుట్టలు, అడవులు కనుమరుగవుతుండటం వల్లనూ గాలి దిశలో అనూహ్య మార్పులు జరిగి కొన్ని ప్రాంతాల్లోనే భారీవర్షాలు పడుతున్నాయి.

- డాక్టర్‌ కె.నాగరత్న, డైరెక్టర్‌, వాతావరణ కేంద్రం, హైదరాబాద్‌

సమగ్ర అధ్యయనం అవసరం

హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లోనే కుండపోత వర్షాలు పడటం, ఒకేరోజు భారీ వర్షపాతం నమోదవటం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్షపాతం నమోదుకు 37 స్వయంచాలిత వాతావరణ నమోదు కేంద్రాలు ఉన్నాయి. గత 30 ఏళ్ల వర్షపాతం వివరాలను టీఎస్‌డీపీఎస్‌ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో వర్షపాతం పెరుగుతున్న ఘటనలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదు కావటం వంటివి గుర్తించాం. ఏడేళ్లలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 0.4 నుంచి 1.2 డిగ్రీల మేర ఉంది. గాలిలో తేమ కూడా పెరుగుతోంది.

- డాక్టర్‌ వై.వి.రామారావు, మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ ,ఐఎండీ, టీఎస్‌డీపీఎస్‌ కన్సల్టెంట్‌

ఇదీ చూడండి: RAIN IN HYDERABAD: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. ఏరులను తలపిస్తున్న కాలనీలు

తెలంగాణ నుంచి నైరుతి పూర్తిగా నిష్క్రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.