ETV Bharat / state

ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి: శ్రీనివాస్ గౌడ్ - Dry Day programme attended by Minister Srinivas Goud

సీజనల్​ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎక్సైజ్​, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా బేగంపేటలోని పర్యాటక భవన్ ప్లాజా హోటల్​లో దోమల నివారణకు మంత్రి చర్యలు చేపట్టారు. సమాజహితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీనివాస్​ గౌడ్​ పిలుపునిచ్చారు.

Dry Day programme attended by Minister Srinivas Goud
'డెంగ్యూని తరిమికొడదాం'
author img

By

Published : Jun 7, 2020, 3:08 PM IST

దోమల నుంచి వచ్చే డెంగీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రపరచుకోవాలని ఎక్సైజ్​, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సూచించారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పేరిట మంత్రి కేటీఆర్​ ప్రారంభించిన డ్రైడే కార్యక్రమంలో శ్రీనివాస్​ గౌడ్​ పాల్గొన్నారు. ఇందులో భాగంగా బేగంపేటలోని పర్యాటక భవన్ ప్లాజా హోటల్​లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు.

పూలతొట్టి, నిల్వ ఉండే ప్రాంతాల్లోని నీటిని తొలగించారు. దోమల ద్వారా సంక్రమించే అన్ని రకాల సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సమాజహితం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి : జనావాసాల్లోకి చిరుతలు రాకుండా ఇలా చేస్తాం.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.