ETV Bharat / state

వైద్యులకు బయోసూట్​... రూపొందించిన డీఆర్​డీవో - కరోనా వైరస్​ లక్షణాలు

కరోనా వైరస్​ సోకిన రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, పారామెడికల్​ సిబ్బందిని రక్షించడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) శాస్త్రవేత్తలు ఒక బయోసూట్​ను తయారు చేశారు. సంస్థకు చెందిన అనేక ప్రయోగశాలల పరిశోధకులు ఈ కసరత్తులో పాలుపంచుకున్నారని అధికారులు తెలిపారు.

DRDO manufactured biosuit for doctors, paramedical employees
వైద్యులకు బయోసూట్​... రూపొందించిన డీఆర్​డీవో
author img

By

Published : Apr 3, 2020, 3:34 AM IST

Updated : Apr 3, 2020, 7:32 AM IST

కరోనా కట్టడిలో నిమగ్నమైన వైద్య, పారామెడికల్​తో పాటు ఇతర సిబ్బంది సురక్షితంగా పనిచేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీవో) బయో సూట్‌ను రూపొందించింది. వివిధ డీఆర్​డీవో ప్రయోగశాలలలోని శాస్త్రవేత్తలు తమ సాంకేతిక పరిజ్ఞానం, ఫాబ్రిక్ కలిగి ఉన్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)ను తయారు చేశారు. ఈ సూట్​ను పూర్తిగా యంత్రం సహాయంతో తయారు చేశామని డీఆర్​డీవో పేర్కొంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్​డబ్ల్యూ) బాడీ సూట్‌ల కోసం నిర్వచించిన ప్రమాణాల కంటే అద్బుతంగా పనిచేస్తుందని వారు వెల్లడించారు. ఈ సూట్లు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు డీఆర్​డీవో ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 7వేల సూట్లు తయారు చేస్తున్నారు. త్వరలోనే రోజుకు 15వేల సూట్లు తయారు చేసే సామర్థ్యానికి పెంచే ప్రయత్నాలు చేస్తామన్నారు.

వైద్యులకు బయోసూట్​... రూపొందించిన డీఆర్​డీవో

ఇవీ చూడండి: రాష్ట్రంలో 154కు చేరిన కరోనా కేసుల సంఖ్య

Last Updated : Apr 3, 2020, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.