ETV Bharat / state

కరోనాపై డీఆర్‌డీవో కదం - నమూనాలు సేకరించేందుకు ప్రత్యేక కియోస్క్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) కరోనాపై పోరులో భాగంగా మరో ఆవిష్కరణ చేసింది. అనుమానితుల నుంచి నమూనాల సేకరణకు కియోస్క్‌ను అభివృద్ధి చేసింది. తొలుత రూపొందించిన రెండు కియోస్క్‌లను ఈఎస్‌ఐ ఆసుపత్రికి అందజేశారు.

drdo-invented-kiosk-technology-for-detect-corona
కరోనాపై డీఆర్‌డీఓ కదం
author img

By

Published : Apr 15, 2020, 9:09 AM IST

కొవిడ్‌-19పై యుద్ధం ప్రకటించిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మరో ఆవిష్కరణ చేసింది. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ప్రయోగశాల(డీఆర్‌డీఎల్‌) వైరస్‌ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రత్యేక కియోస్క్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీ వైద్యులు డీఆర్‌డీఎల్‌కు తోడ్పాటు అందించారు.

ఎలా పనిచేస్తుంది?
వైద్య సిబ్బంది కియోస్క్‌ బయట ఉండి ముందే సిద్ధం చేసిన గ్లౌజుల్లోకి చేతులు ఉంచి.. ఎదుటి వ్యక్తి కన్పించేలా ముందువైపు అద్దం క్యాబిన్‌ ఉంటుంది. అనుమానితులు వచ్చి కియోస్క్‌లో నిలబడితే వారి గొంతు, ముక్కు నుంచి కఫం సేకరిస్తారు. దగ్గినా, తుమ్మినా గొంతు, ముక్కు నుంచి తుంపర్లు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఒకసారి వ్యక్తి వచ్చి వెళ్లిన తర్వాత దానంతట అదే శుభ్రపర్చుకునే విధంగా రూపకల్పన చేశారు. నాలుగు వైపులా బిగించిన నాజిల్స్‌ నుంచి రసాయన ద్రావణం దాదాపు 70 సెకన్ల పాటు పిచికారీ అవుతుంది.

నీరు, యూవీ కిరణాలతోనూ శుభ్రపరుస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నిమిషాల్లో పూర్తై మరో రోగి నుంచి నమూనాలు తీసుకునేందుకు కియోస్క్‌ సిద్ధం అవుతుంది. తొలుత రూపొందించిన రెండు కియోస్క్‌లను ఈఎస్‌ఐ ఆసుపత్రికి అందజేశారు.

ఇదీ చూడండి: గాంధీలో ముగ్గురు రోగులకు ప్లాస్మా చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.