ETV Bharat / state

కొవిడ్​ రోగులపై 2-డీజీ సమర్థవంతంగా పనిచేస్తోంది: డీఆర్​డీవో ఛైర్మన్​

మధ్యస్త, తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ రోగులపై 2-డీజీ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని డీఆర్​డీవో ఛైర్మన్​ డాక్టర్​ సతీష్​ రెడ్డి తెలిపారు. కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ధి, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

drdo chairman satish reddy
కొవిడ్​ రోగులపై 2-డీజీ సమర్థవంతంగా పనిచేస్తోంది: డీఆర్​డీవో ఛైర్మన్​
author img

By

Published : Jun 8, 2021, 7:47 PM IST

కరోనాపై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2-డీజీ ఔషధం అభివృద్ధి సహా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని డీఆర్​డీవో ఛైర్మన్‌ డాక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. 2-డీజీ ఔషధంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ రోగులపై ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని.. ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గిస్తుందని వివరించారు.

పైలట్ రక్షణ కోసం డీఆర్​డీవో రూపొందించిన... ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టంను ఆస్పత్రుల్లో ఆక్సిజన్ తయారీకి వినియోగిస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థతో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న ప్రధాని ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని సతీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల నాటికి 2-డీజీ ఔషధాన్ని విస్తృతంగా ఉత్పత్తి చేసి దేశంలోని ఆస్పత్రులకు తగినంత పంపిణీ చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో దీపక్ సప్రా తెలిపారు. ఈ వెబినార్​లో ఔషధ తయారీలో పాలు పంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ సహా పలువురు పాల్గొన్నారు.

2--డీజీకి డిమాండ్​ పెరిగింది

దేశవ్యాప్తంగా 2-డీజీ ఔషధానికి డిమాండ్‌ ఏర్పడింది. ఔషధం ఉపయోగించిన రోగులు త్వరగా కోలుకుంటున్నారు. వారికి ఆక్సిజన్‌ వినియోగం తక్కువగా అవసరమవుతుంది. రక్షణ రంగం ఆన్‌బోర్డ్‌ ఆక్సిజన్‌ జనరేటింగ్‌ సిస్టం ద్వారా 850 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నాం . జాలై చివరికల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. -డాక్టర్‌ సతీష్ రెడ్డి, డీఆర్‌డీవో ఛైర్మన్‌

కొవిడ్​ రోగులపై 2-డీజీ సమర్థవంతంగా పనిచేస్తోంది

ఇదీ చదవండి: Bandi sanjay: తెలంగాణకు జూన్​, జులైలో 20లక్షల చొప్పున వ్యాక్సిన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.