ETV Bharat / state

competitive exam training fees: ఇవేమి 'శిక్షణ ఫీజులు' బాబోయ్​.. మేం మోయలేకున్నాం.. - job notifications

competitive exam training fees: ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి అవాక్కయ్యారు. భరించే స్థితి లేకపోవడంతో  లైబ్రరీలో చదువుకుంటున్న వారిని అడిగి కొన్ని పుస్తకాలు కొనుగోలు చేసి ఊరెళ్లిపోయారు.

competitive exam training fees: ఇవేమి ఫీజులు బాబోయ్​.. మేం మోయలేకున్నాం..

author img

By

Published : Feb 16, 2022, 4:57 AM IST

రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయో కానీ.. శిక్షణ కోసం ఉద్యోగార్థుల ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కరోనాకు ముందుతో పోల్చితే ప్రైవేటు శిక్షణ సంస్థలు, వసతి గృహాల ఫీజులు దాదాపు రెట్టింపయ్యాయి.పేరున్న శిక్షణ సంస్థల్లో గ్రూప్‌-1 కోచింగ్‌కు రూ.60 వేలు-లక్ష చెల్లించాల్సి వస్తోంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో గ్రూప్‌-1, 2, 3, 4 శిక్షణ కోసం గ్రామాల నుంచి యువత హైదరాబాద్‌కు వస్తున్నారు. కరోనాతో ఓవైపు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అప్పులు చేసి కొలువుల ఆశతో శిక్షణ కేంద్రాల వైపు వెళ్తున్నారు. గ్రూప్‌-1 శిక్షణ, వసతి, పుస్తకాలు తదితర వాటి కోసం సగటున ఒక్కో అభ్యర్థి ఏడాదికి రూ.2.50-3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఈ ఖర్చు రెండింతలవుతోంది. వీటిని భరించలేని కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఇంటికి వెళ్లిపోతున్నారు.

కరోనాకు ముందు గ్రూప్‌-1, 2 ఫీజులు తక్కువగా ఉండేవి. మధ్య స్థాయి శిక్షణ సంస్థలు గ్రూప్‌-1కు రూ.35 వేలు, గ్రూప్‌-2కు రూ.15 వేల వరకు తీసుకునేవి. ప్రస్తుతం గ్రూప్‌-2కు రూ.25 వేల వరకు తీసుకుంటున్నాయి. కరోనాకు ముందు నెలకు రూ.4-5 వేలు ఉండే మెస్‌ ఛార్జీలు.. రూ.8-12 వేలయ్యాయి. ఉదాహరణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పరీక్ష కోసం శిక్షణ సంస్థల్లో మూడేళ్ల క్రితం రూ.16 వేల ఫీజు ఉండేది. ఇటీవల రూ.25-40 వేలకు పెరిగిందని ఆ పరీక్షకు శిక్షణ పొందిన అభ్యర్థి రాజు వెల్లడించారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీరూమ్‌ పేరిట నెలకు రూ.1,500-2,000 వసూలు చేసే సంస్థలూ వెలిశాయి. మహమ్మారితో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదు. ఇదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కన్నా, ఆన్‌లైన్‌ కోచింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మేరకు శిక్షణ సంస్థలు ప్రత్యేక యాప్‌లు రూపొందించాయి. ఫీజులూ భారీగానే ఉంటున్నాయి. గ్రూప్‌-1 కోసం కొన్ని సంస్థలు రూ.50 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలతో పాటు స్టడీమెటీరియల్‌ ఇస్తామని చెబుతున్నాయి. గ్రూప్‌-2 కోసం రూ.5-8 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల్లో ఎలాంటి రాయితీలివ్వడం లేదు.

ప్రత్యామ్నాయాల వైపు చూపు..

* ఫీజులు, ఖర్చులు పెరగడంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో కొందరు అభ్యర్థులు గ్రూప్‌-1, 2 కోసం సమగ్రంగా రాసుకున్న నోట్స్‌ను అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని జిరాక్స్‌ కేంద్రాలు విక్రయిస్తున్నాయి. గ్రూప్‌-2 అన్ని సబ్జెక్టుల నోట్స్‌కు రూ.1,800-2,000 వరకు వసూలు చేస్తున్నాయి.

* తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా ఉన్నప్పటికీ.. అప్‌డేటెడ్‌ వెర్షన్లతో రావడం లేదు. దీంతో అభ్యర్థులు పాతపుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. అప్‌డేటెడ్‌ సమాచారం కోసం దినపత్రికలు, యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. రిఫరెన్స్‌ పుస్తకాల కోసం రూ.4-5వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది.

* యూట్యూబ్‌లో కొందరు నిపుణులు గ్రూప్‌-1, 2 సబ్జెక్టులు, చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌ తదితర సమాచారాన్ని వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటిని కొందరు వినియోగించుకుంటున్నారు.

ఇదీ చూడండి: Job notifications: కసరత్తు పూర్తి.. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.