Double Bedroom Houses Distribution In Hyderabad : గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మూడు, నాలుగో దశకు సంబంధించి మరో 21 వేల మంది లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. డ్రాలో ఎంపికయిన లబ్దిదారులకు అక్టోబర్ 2, 5 తేదీల్లో ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు దశల్లో 24,900 ఇళ్లను లబ్దిదారులకు అందించింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2 BHK Third Forth Phase Distribution Today : గ్రేటర్ హైదరాబాద్లో ఇవాళ మూడు, నాలుగు దశల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి డ్రా నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో ఈ ర్యాడమేజేషన్ ఆన్ లైన్ డ్రా తీయనున్నారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా మొదటి విడతలో ఎన్ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్దిదారులకు, రెండో విడతలో 13,300 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు.
2BHK Distribution in Hyderabad : మొత్తం గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్ల పంపిణీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విడతల వారీగా మిగతా దశల్లో రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ నిర్వహించే ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా ద్వారా 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక చేస్తారు. ఇందులో మూడో దశలో 10,500, నాలుగో దశలో 10,500 చొప్పున 21 వేల లబ్దిదారులకు ఒకేసారి ఎంపిక చేస్తారు. అక్టోబర్ 2 వ తేదీన 10,500, అక్టోబర్ 5 వ తేదీన 10,500 ఇళ్లను లబ్దిదారుకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Distribution of Second Phase Double Bedrooms : ఈనెల 21 నుంచి రెండోవిడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ