Double Bedroom Houses Distribution in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల(Double Bedroom House) ఎంపిక, కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల మొదటి విడతలో 11,700 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. శుక్రవారం రెండో విడతలో 13,200 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రేటర్ హైదరాబాద్(GHMC)లో మొత్తం 24 నియోజకవర్గాల్లో రిజర్వేషన్ల వారీగా.. లాటరీ తీశారు. ఇందులో వికలాంగులకు 470, ఎస్సీలకు 1923, ఎస్టీలకు 655, ఇతరులకు 8652.. మిగిలినవి లోకల్ కోటాలో గ్రేటర్ పరిధిలో రాని ప్రాంతాల వారికి ఇళ్ల కేటాయింపు పూర్తి చేశారు.
గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటివరకు 3.55 లక్షల మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది పరిశీలనలో 1,31,214 మంది అర్హులుగా తేల్చారు. ఇవాళ హైదరాబాద్ జిల్లాలో 7300, మేడ్చల్ జిల్లాలో 2000, రంగారెడ్డి జిల్లాలో 1900, సంగారెడ్డి జిల్లాలో 500 మంది లబ్దిదారులు ఎంపికయ్యారు. మొత్తం 24 నియెజకవర్గాలకు 23 నియెజకవర్గాల్లో మొదటి విడత 500 మందిని, రెండో విడత మరో 500 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మొదటి విడత 200 మందినీ, రెండో విడతలో 300 మందిని ఎంపిక చేశారు.
GHMC Double Bedroom Houses : రెండో దశలో ఎంపికైన వారికి సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్‌నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల లబ్ధిదారులకు దుండిగల్‌లో నిర్మించిన ఇళ్లను కేటాయించనున్నారు. కుత్బుల్లాపూర్ గ్రేటర్ పరిధి కానీ వారికి బహదూర్‌పుర, పోచంపల్లిలో ఇళ్లను నిర్మించిన ఇళ్లను కేటాయించనున్నారు. గోషామహల్, నాంపల్లి, కార్ఖానా, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, రాజేంద్రనగర్, బహదూర్‌పుర, పటాన్చెరువు గ్రేటర్ పరిధి కాకుండా ఉన్న నియోజకవర్గాల లబ్ధిదారులకు కొల్లూరు-2లో ఇళ్లు కేటాయించనున్నారు.
Double Bedroom House Lucky Draw Hyderabad : డబుల్ బెడ్రూం ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభం
Double Bedroom Beneficiaries within Greater Hyderabad : మల్కాజిగిరి, మూషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు అహ్మద్‌గూడ, జవహర్‌నగర్-3లో నిర్మించిన ఇళ్లు కేటాయించనున్నారు. ఉప్పల్ నియోజకవర్గం లబ్ధిదారులకు శ్రీరామ్‌నగర్, చెర్లపల్లిలో నిర్మించిన ఇళ్లను అందించనున్నారు. ఎల్బీనగర్, అంబర్పేట్, మేడ్చల్ గ్రేటర్ పరిధిలో కానీ నియోజకవర్గాలకు ప్రతాప్ సింగారంలో నిర్మించిన ఇళ్లను అందించనున్నారు. మలక్‌పేట్, యాకుత్‌పురా నియోజకవర్గాలకు హట్టిగూడ, తట్టిఅన్నారంలో నిర్మించిన వాటిని అందించనున్నారు. మహేశ్వరం, చార్మినార్ నియోజకవర్గాలకు మంకాల్‌లో నిర్మించిన వాటిని అందిస్తారు.
ఎదురుచూపులు 'డబుల్'.. నిర్మాణాలు పూర్తయినా అందని ద్రాక్షగానే..!
పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలి : పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేటాయింపులో ఎలాంటి ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీ తనాన్ని సూచిస్తుందని అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి అన్నారు.