దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా 21,437 మందికి డిగ్రీ సీట్లు కేటాయించారు. ఈ మేరకు ప్రత్యేక విడతలో సీటు పొందిన విద్యార్థులు నవంబరు 5 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో సీటు పొందిన 1,87,709 మంది విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్టు కన్వీనర్ వివరించారు. ఈ సందర్భంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులందరూ నవంబరు 5 వరకు కాలేజీలకు వెళ్లి ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి.. రైతులంతా ఏకమై పంటకు ధర నిర్ణయించుకోవాలి: కేసీఆర్