గోదావరిలో బోటు ప్రమాద ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బోటులో విశాఖ వాసులు ఉన్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ వినయ్ చంద్ సహాయక కేంద్రం ఏర్పాటు చేసి బాధితులు వివరాల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ - 1800 425 00002 కు సంప్రదించాలని తెలిపారు. నేవీ విమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్లను ఘటనా స్థలానికి పంపించామని కలెక్టర్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో హెలికాఫ్టర్స్ ఘటనా స్థలానికి చేరుకుంటాయన్నారు.
గల్లంతైన వారి కోసం రంగంలోకి నేవి విమానాలు - boat accident vicitims
గోదావరి పడవ ప్రమాదంలో ఉన్న బాధితుల్లోని విశాఖ వాసుల కోసం అక్కడి కలెక్టరేట్లోని కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. బాధితులు అధైర్యపడొద్దని సందేశమిచ్చారు.