సికింద్రాబాద్ మారేడ్‌పల్లి కస్తూర్‌బా మహిళా కళాశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా భద్రతా విభాగం ఐజీపీ స్వాతి లక్రా పలువురు కవులు రచించిన కవిత సంపుటిలను ఆవిష్కరించారు. మహిళలు, విద్యార్ధినులపై ఆకతాయిల వేధింపులను ఉపేక్షించవద్దని స్వాతి లక్రా సూచించారు. షీ బృందాల పోలీసులు వేధింపులను నిరోధించడానికే ప్రత్యేకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
'ప్రతీ స్త్రీ హాక్ ఐ యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలి'
ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపడుతున్నామని స్వాతి లక్రా వెల్లడించారు. విద్యార్ధినులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే సవాళ్లను ఎదుర్కొగలుగుతామని స్ఫూర్తి రగిలించారు. ప్రతీ కళాశాలలో వేధింపుల నిరోధకం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. విద్యార్ధినులు తమ మొబైల్ ఫోన్‌లల్లో హాక్ ఐ యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలని లక్రా సూచించారు.
ఇవీ చూడండి : 'ఆరిఫాను ఆ అబ్బాయే చంపాడు'